ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 16 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు ఈ సమయంలో ప్రాథమిక పాఠశాలలో బ్రిడ్జ్ కోర్స్ నిర్వహించాలి.
అభ్యసనాభివృద్ధికి..బ్రిడ్జి కోర్సు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ఆయా తరగతులకు సంబంధించిన విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ బ్రిడ్జి కోర్సు(సమగ్రఅభ్యసనాభివృద్ధి కార్యక్రమం)కు శ్రీకారం చుట్టింది.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు నెల రోజులు విద్యార్థుల ప్రమాణాలను పెంపొందిచేందుకు వీలుగా షెడ్యూలు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడరేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 5 వతరగతి వరకు ఇంగ్లీషుమీడియం లో విద్యప్రవేశపెడుతున్నందున దానికి తగ్గట్టుగా పిల్లలను సంసిద్ధులను చేయనున్నారు. ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో పూర్తిస్థాయి విజ్ఞానం అందేలా శిక్షణ ఇస్తారు.
ఆయా తరగతుల్లో విద్యార్థుల స్థాయిని బట్టి లెవల్-1, లెవల్-2గా విభజిస్తారు. వీరికి మొదట మార్చి 16న బేస్‌లైన్ టెస్టు నిర్వహించి ప్రమాణాలను అంచనావేస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 21 వరకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తారు. 22న విద్యార్థులకు ఎండ్‌లైన్ పరీక్ష పెడతారు. 23న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తారు. అన్ని తరగతుల్లో ఆయా సబ్జెక్టుల్లో మొత్తం 14 అంశాలపై శిక్షణ ఇస్తారు. విద్యార్థుల్లో రాత నైపుణ్యాన్ని పెపొందించేందుకు ప్రత్యేకంగా వర్క్‌షీట్ కూడా అందజేస్తారు. గణితంలో అంకెలు, సంఖ్యలు, చతుర్విధ ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందిస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌లో అక్షరాలు, పదాలు, వాక్యాలతో పాటు కాంప్రెహిన్సివ్ నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. బ్రిడ్జి కోర్సు నిర్వహణలో దృశ్యశ్రవణ పరికరాలను వినియోగించేందుకు ప్రతిపాఠశాలకు రూ.5 వేలు మంజూరు చేస్తారు.
అన్ని పాఠశాలల్లో బ్రిడ్జి కోర్సును పక్కాగా నిర్వహించేందుకు మండల విద్యాధికారులు, జిల్లావిద్యాధికారులు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని ఉత్తర్వులో ఆదేశించారు. శిక్షణ పర్యవేక్షణ బాధ్యతను హెచ్‌ఎంలకు అప్పగించారు.
Daily schedule of Bridge course:
Time Activity
8.00 - 8.30 Assembly
8.30 - 9.15 Rhyme time
9.15 - 9.20 Water break
9.20 - 10.05 Game time
10.05 - 10.15 Interval
10.15 - 11.00 Writing time
11.00 - 11.45 Story time
11.45 - 12.30 Fun time
ANNEXURE - I
DAY-WISE THEMES
16-Mar Monday Baseline Test
17-Mar Tuesday My home
18-Mar Wednesday My home
19-Mar Thursday Myself
20-Mar Friday Myself
21-Mar Saturday Plants
23-Mar Monday Plants
24-Mar Tuesday Festivals
26-Mar Thursday Festivals
27-Mar Friday Animals
28-Mar Saturday Animals
30-Mar Monday Fruits & vegetables
31-Mar Tuesday Fruits & vegetables
01-Apr Wednesday Flowers
03-Apr Friday Flowers
04-Apr Saturday Objects at home/classroom
06-Apr Monday Objects at home/classroom
07-Apr Tuesday Games & material
08-Apr Wednesday Games & material
09-Apr Thursday Transport
11-Apr Saturday Transport
13-Apr Monday Places/ institutions
15-Apr Wednesday Places/ institutions
16-Apr Thursday Professions
17-Apr Friday Professions
18-Apr Saturday Nature
20-Apr Monday Feelings & descriptions
21-Apr Tuesday Feelings & descriptions
22-Apr Wednesday End line Test
23-Apr Thursday Valediction/Mega Parent-teacher meet
Click here to download details 👇
https://drive.google.com/file/d/1EahzhOFIqZySp1TRPslNVenj3FkycLK-/view?usp=drivesdk