AP Summative 1 జనవరి 2023 పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన CSE & SCERTAP SA 1. జనవరి 2 నుండి 10 వరకు నిర్వహణ.
AP Summative 1 జనవరి 2023 పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన CSE & SCERTAP
SA 1.. జనవరి 2 నుండి 10 వరకు నిర్వహణ.
8వ తరగతి గణితం మరియు జనరల్ సైన్స్ పరీక్ష ప్రభుత్వం అందించిన ట్యాబ్ లలో నిర్వహించాలి.
పాఠశాల విద్యార్థులకు జనవరి 2 నుంచి సమ్మెటీవ్ అసెస్మెంట్-1 పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎస్ సిఇఆర్ టి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి గురువారం విడుదల చేశారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జనవరి 2 నుంచి 10వ తేది వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు జనవరి 4 నుంచి 6వ తేది వరకు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు గణితం, జనరల్ సైన్స్ పరీక్షలకు రాష్ట్రప్రభుత్వం అందించిన ట్యాబ్లో ఉన్న ప్రశ్నపత్రాలను తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన అన్ని సబ్జెక్టులు, అన్ని తరగతులకు డిసిఇబి ద్వారా ముద్రించబడిన కామన్ ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
1 నుండి 10 వ తరగతుల వరకు సమ్మేటివ్ 1 పరీక్షల టైం టేబుల్