పాఠశాల విద్యలో సెమిస్టర్ పరీక్షలు -
వచ్చే విద్యాసంవత్సరంనుంచి అమలు
✫ పాఠశాల విద్యలో సెమిస్టర్ పరీక్షల విధానాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది.
✫ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎసిసిఇఆర్ టి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి శనివారం విడుదల చేశారు.
✫ 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఈ విధానం 2023-24 (వచ్చే విద్యాసంవత్సరం) నుంచి అమలు కానుందని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడతామని వెల్లడించారు.
✫ నూతన విద్యావిధానం - 2020లో భాగంగా రాష్ట్రప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది.
✫ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఎస్సిఇఆరి ఇప్పటికే మూడు సెమిస్టర్ల విధానంలో, 6వ తరగతి విద్యార్థులకు రెండు సెమిస్టర్ల విధానంలో పాఠ్యాంశ పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అందజేసింది.
✫ 7, 8 తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి రెండు సెమిస్టర్ల విధానంలో పుస్తకాల అందజేసింది.
✫ పరీక్షలను మాత్రం ఎప్పుడూ నిర్వహించే విధంగా విద్యాసంవత్సరం చివరిలో నిర్వహించారు.
✫ వచ్చే విద్యాసంవత్సరం నుంచి పుస్తకాల ఇవ్వడమూ, పరీక్షలు నిర్వహించడమూ సెమిస్టర్ విధానంలోనే జరగనుంది.
✫ ప్రస్తుతం ఈ విధానం సిబిఎస్ఇ విద్యార్థులకు అమలవుతుంది. ఎస్ సిఇఆర్ టి ద్వారా సిబిఎస్ఇ సిలబస్ ను రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.