Learn A Word A Day (30days) Program in all management schools Guidelines, Action plan Rc No. Spl.SCEERT/2022 Dated : 14.02.2022
15.02.2022 నుండి 15.03.2022 వరకు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని అన్ని పాఠశాలల్లో "లెర్న్ ఎ వర్డ్ ఎ డే" (30 రోజులు) వినూత్న కార్యక్రమం అమలు - రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో ఉత్తర్వులు విడుదల.
~Learn a word a day~
అన్ని యాజమాన్య పాఠ శాల ల్లో రేపటి నుండి అనగా 15-02-2022 నుండి 15-03-2022 వరకు "learn a word a day" programme నిర్వహించాలి.
📌విద్యార్థుల స్థాయిని( తరగతిని) బట్టి 4 లెవెల్స్ గా విభజించాలి.
లెవెల్ 1 : 1 నుండి 2 తరగతులు
లెవెల్ 2 : 3 నుండి 5 తరగతులు
లెవెల్ 3 : 6 నుండి 8 తరగతులు
లెవెల్ 4 : 9 మరియు 10 తరగతులు
నిర్వహణ విధానం:
📌ఈ కార్యక్రమం 30 రోజుల పాటు నిర్వహించాలి.
📌ప్రతి రోజు మొదటి పీరియడ్ లోఒక కొత్త ఆంగ్ల పదం పరిచయం చెయ్యాలి.
📌రెండవ పీరియడ్ లో పిల్లలచేత డిక్షనరీలో ఆ పదం యొక్క అర్థాన్ని వెతికించాలి.
గమనిక : లెవెల్ 1 విద్యార్థులకు ఆ రెండవ పీరియడ్ ఉపాధ్యాయుడే పదం యొక్క అర్థాన్ని వివిధ ఉదాహరణలతో, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.
📌ఆంగ్ల ఉపాధ్యాయుడు తన పీరియడ్ లో పదాన్ని వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో వివరించాలి.
📌4 వ పీరియడ్ లో level specific activities క్రింది విధంగా నిర్వహించాలి.
📌లెవెల్1: ఓరల్ డ్రిల్లింగ్
📌లెవెల్ 2 : స్పెల్లింగ్ గేమ్
📌లెవెల్ 3 : విద్యార్థులు డిక్షనరీ సహాయంతో పదం యొక్క parts of speech కనుక్కోవాలి.
📌లెవెల్ 4 : విద్యార్థులు డిక్షనరీ సహాయంతో వ్యతిరేఖ పదాలు,సమాన అర్థ పదాలు వెతకాలి.
📌అదే పదం మిగిలిన అన్ని పీరియడ్ లలో repeat చెయ్యాలి.
📌ప్రతి రోజు ఒక పదాన్ని బోర్డ్ పై ఒక మూలలో వ్రాయాలి.వరండా లో, అసెంబ్లీ లో ప్రదర్శించాలి.
📌 అందరు టీచర్లు పదాన్ని,దాని అర్థాన్ని పీరియడ్ లో 5 నిమిషాలు పిల్లలచే ప్రాక్టీస్ చేయించాలి.
అయితే పదం యొక్క ఉపయోగిత మాత్రం ఆంగ్ల ఉపాధ్యాయుడు బోధించవచ్చు.
📌ఈ కార్యక్రమం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా ఒక 100 పేజీల నోటు పుస్తకం పెట్టాలి.ఆ పుస్తకాన్ని ఉపాధ్యాయుడు తరచూ తనిఖీ చెయ్యాలి.
📌ప్రతి పక్షానికి (15 రోజులు), అంతవరకు నేర్పించిన పదాల పై "స్పెల్ బీ" నిర్వహించాలి.
📌ఇంటివద్ద పదాలను ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహించాలి.
📌లెవెల్ వారీ ఏ రోజు ఏ పదం నేర్పాలో ప్రొసీడింగ్స్ లోని annexures1-4 లో ఇవ్వబడినది.
పూర్తి వివరాలు, ఉత్తర్వులు, 30 రోజులకు రోజువారీ షెడ్యూల్... ⤵️