HERB AP Employees Pay Slips
సమస్యలు పరిష్కారాలు
💥HERB AP Employees Pay Slips
👉.APGLI ట్యాబ్ ను యాప్ నుండి రిమూవ్ చేశారు
👉.పే స్లీప్ ట్యాబ్ మరియు ఎంప్లాయ్ సర్వీసెస్ ట్యాబ్ మాత్రమే ఉన్నాయి
👉.HERB అప్డేట్ చేసిన యాప్ ను కింది లింకు లో డౌన్లోడ్ చేసుకోవచ్చు
💥. కొన్ని సమస్యలు పరిష్కారాలు
👉.1. మొబైల్ నెంబర్ మారింది. ఓటీపీ రావడం వేరే నెంబర్ కు వెళుతుంది.
జ) డీడీఓ లాగిన్ లో మొబైల్ నెంబర్ వెంటనే మార్చుకొనే అవకాశం ఉంది.. డీడీఓ గారిని సంప్రదించి హెర్బ్ ఎంప్లాయ్ మాస్టర్ డాటా లో మన మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు
లేదా CFMS హెల్ప్ డెస్క్ లో కంప్లయింట్ రైజ్ చేసి కూడా మొబైల్ నెంబర్ మార్చుకొనే అవకాశం ఉంది. కానీ అది పూర్తి అయ్యే నాటికి వారం నుండి 10 రోజుల సమయం పడుతుంది.
👉.2. ఓటీపీ రావడం లేదు
జ) సర్వర్ బిజీ గా ఉన్న సమయాల్లో లేదా ఓటీపీ పంపించే నెట్వర్క్ బిజీ గా ఉన్న సమయాల్లో ఓటీపీ రావడం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాసేపు ఆగి తరువాత ప్రయత్నిస్తే అప్పుడు ఓటీపీ వస్తుంది
👉.3) ఇన్వాలిడ్ లాగిన్ అని వస్తుంది
జ ) యాప్ పాత వెర్షన్ లో ఉంటే అ విధంగా వస్తుంది. కాబట్టి యాప్ ను అప్డేట్ చేసికోవాలి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది.
👉.4) పాస్వర్డ్ ఏమిటి. మార్చుకొనే అవకాశం ఉందా ?
జ) అందరికీ ఒకటే పాస్వర్డ్ cfss@123. పాస్వర్డ్ లాగిన్ అయ్యాక మార్చుకోవచ్చు. అయితే లాగిన్ కోసం ఓటీపీ వస్తుంది కాబట్టి మన డాటా వేరే వాళ్ళు ఆకెస్స్ చేసే అవకాశం లేదు కాబట్టి, పాస్వర్డ్ మార్చకపోయనా ఇబ్బంది లేదు.