ఈ - జాదూయీ పిటారా ఆప్
ఈ - జాదూయీ పిటారా ఆప్ అనేది 1 నుంచి 5 తరగతులు చదివే విద్యార్థులకు ఉపయోగపడే ఒక యాప్. ఈ యాప్ లో పిల్లలకు ఉపయోగపడే చిన్న చిన్న వీడియోస్ , యాక్టివిటీస్ మరియు కథలు ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా పిల్లవాడు ఈజీగా అభ్యసన చేయడానికి వీలవుతుంది.
ఈ యాప్ లో మూడు భాగాలు ఉంటాయి.
1. కథా సఖి
2. పేరెంట్ తార
3. టీచర్ తార
అనే మూడు భాగాలు ఉంటాయి.
1. విద్యార్థులు కథాకళిలో ఉండే వీడియోస్ ను చూడడం ద్వారా సులభంగా అభ్యసన చేయడానికి వీలవుతుంది.
2. తల్లిదండ్రులు పేరెంట్ తార లో మీరు మీ పిల్లల సమస్యలను తెలుసుకోవడానికి ప్రశ్నలు అడిగినట్లయితే వాటికి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది.
3. టీచర్ తారాలో ఉపాధ్యాయుడు పిల్లలకు ఏ విధంగా బోధించాలో కృత్యాల ఆధారంగా వివరించడం జరుగుతుంది.
4. కావున ప్రతి ఉపాధ్యాయుడు మరియు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని పైన ఇవ్వబడిన అంశాల ఆధారంగా పిల్లవానికి బోధన ప్రక్రియలో దోహదపడే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాము.