AP SA 1 Time Table 2023-24 Revised
SUMMATIVE EXAMINATIONS (SA1) 2023-24 SHEDULE FOR CLASSES 1 TO 10
S.A - 1 పరీక్షల షెడ్యూల్ మార్పు:
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్సీఈఆర్టీ వచ్చే నవంబర్ మూడవ తేదీన దేశవ్యాప్తంగా స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ సర్వేలో విద్యార్థులు ప్రతిభను చూపడానికి వీలుగా ప్రాక్టీస్ టెస్టులను విడుదల చేసింది. ప్రాక్టీస్ టెస్టులను నిర్వహించుటకు అక్టోబర్ పదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు షెడ్యూల్ విడుదల చేసింది.
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ 4వ తేదీ నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ నిర్వహించవలసి ఉంది.
కానీ స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహణ మరియు విద్యార్థుల ప్రిపరేషన్ దృష్ట్యా మరియు ఎస్ఏ 1 కు విద్యార్థులు సిద్ధం అవ్వడం కోసం పరీక్షల టైం టేబుల్ ను రీ షెడ్యూల్ చేయడం జరిగింది.
మరలా ఇప్పుడు నెల 14 నుండి 20 వరకు "గ్రంధాలయ వారోత్సవాలు" కారణంగా నవంబర్ 24 వ తేదీ నుండి డిసెంబర్ 6 వరకు SA-1 పరీక్షలు నిర్వహణకు సవరించిన సూచనలు షెడ్యూల్ తో ఉత్తర్వులు విడుదల. మరలా తాజాగా స్వల్ప మార్పులతో నవంబర్ 14న కొత్త టైం టేబుల్ విడుదల చేసిన SCERT AP.
సవరించిన SA1 Time Table
1st to 5th:
28.11.2023 - తెలుగు
01.12.2023 - ఇంగ్లీష్
02.12.2023 - లెక్కలు
04.12.2023 - EVS
05.12.2023 - టోఫెల్
6th to 10th:
28.11.2023 - తెలుగు
01.12.2023 - హిందీ
02.12.2023 - ఇంగ్లీష్
04.12.2023 - లెక్కలు
06.12.2023 - జనరల్ సైన్స్ / ఫిజికల్ సైన్స్
06.12.2023 - బయాలజీ
07.12.2023 - సోషల్
08.12.2023 - టోఫెల్
Ref:
1. Academic Calendar 2023-24.
2. RC. No:ESE02/963/2023-SCERT Dated:27/09/2023 of CSE AP.
3. Rc. No:ESE02/903/2023-SCERT Dated: 06/10/2023 of SPD SS, AP
The attention of all the regional Joint Directors of School Education and District Educational Officers in the state is drawn to Reference 1, which issued the year-long schedule for conducting Assessments for the academic year 2023- 24 in all management schools across the state.
In light of the SEAS (State Educational Achievement Survey) preparation, instructions have been given to prepare students of classes 3, 6, and 9 according to the assessment framework outlined by NCERT.
Furthermore, it has been observed in the academic calendar for 2023-24 that Summative Assessment 1 was initially scheduled for 04.11.2023. However, due to the SEAS preparation and survey schedule, and keeping in mind the national Library Week from November 14th to 20th, SA1 has been rescheduled and will now be conducted from 24.11.2023.
It is requested that the State Project Director of Samagra Shiksha, Andhra Pradesh, ensure that the required budget for SA1, as per which already approved CBA1 financial norms, is met from State Samagra Shiksha funds.
District Educational Officers are requested to submit the expenditure bills regarding printing, Scanning and other expenditures for SA1 as per the approved financial norms in CBA1 (2023-24) to the State Project Director, Samagra Shiksha, AP.
The revised schedule, syllabus, and timetable for Summative Assessment -1 are attached herewith.
This has got the approval of Commissioner of School Education, AP.
Government Of Andhra Pradesh Department Of School Education State Council Of Educational Research and Training, AP.
సంగ్రహణాత్మక మదింపు-1 (నవంబరు 2023) పరీక్షల నిర్వహణకు సూచనలు.
Ref: Proc. of the Commissioner, School Education, vide Rc No: ESE02/1121/2023-SCERT Dt: 08/11/2023, ఈ సూచనలను ప్రతి మండల విద్యాశాఖాధికారి, కాంప్లెక్స్ హెడ్మాస్టరు, CRP మరియు అందరూ ఉపాధ్యాయులు పూర్తిగా చదివి అర్ధం చేసుకొని పరీక్ష నిర్వహించాలి.
1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో మరియు ప్రైవేటు యాజమాన్య పాఠశాలలలో SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 24.11.2023 నుండి 06.12.2023 వరకు SA-I పరీక్షలు నిర్వహించాలి.
2. అట్లే CBSE సిలబస్ చదువుతున్న VIII, IX తరగతుల విద్యార్థులకు తేదీ 28.11.2023 నుండి 06.12.2023 వరకు Term-I పరీక్షలు నిర్వహించాలి. (ఇందు వెంట Time Tables ను జత చేయడం అయినది)
3. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు PS, BS సంగ్రహణాత్మక మదింపు పరీక్షలు విడివిడిగా నిర్వహించాలి.
4. ఈ విద్యా సంవత్సరం 1 వ తరగతి నుండి 9 తరగతి వరకు గల విద్యార్థులకు ద్విభాష ( TM/EM) ప్రశ్నా పత్రాలను పంపడం జరినది.
మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు:
5. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి పంపబడే ప్రశ్నాపత్రాలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. ప్రశ్నాపత్రాలను మండల విద్యాశాఖాధికారి మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను.
6. 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా (ప్రభుత్వ ప్రశ్నా పత్రములు కై ఫీజు చెల్లించిన ప్రైవేటు పాఠశాలలతో సహా - లిస్టు మీ మెయిలుకు పంపడమైనది) విభజించుకొని, పాఠశాలల యొక్క తరగతి వారీగా విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులతో సహా 23.11.2023 వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారీ ఇవ్వవలసినట్లుగా తెలియజేయవలెను.
పరీక్షల సమయంలో చేయవలసిన పనులు:
7. 6 నుండి10వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను అన్ని యాజమాన్య పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.
పరీక్షల అనంతరం చేయవలసిన పనులు:
8. పరీక్షల అనంతరం అనగా, 07.12.2023 తేదీ నుండి 09.12.2023 తేదీ వరకు మీ మండలములోని అన్ని ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయులు జవాబు పత్రములను కీ తయారు చేసికొని మూల్యాంకనము చేసిందీ/లేనిది పర్యవేక్షించాలి.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు:
9. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారీగా విద్యార్ధుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRP ద్వారా 23.11.2023 వ తేదీ తెప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.
10. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నాపత్రాలను, పరీక్షకు గంట ముందు మాత్రమే ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.
11. పరీక్షల అనంతరం అనగా, 07.12.2023 తేదీ నుండి 09.12.2023 తేదీ వరకు మీ కాంప్లెక్స్ నందలి అన్ని ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు జవాబు పత్రములను కీ తయారు చేసికొని మూల్యాంకనము చేసింది. లేనిది పంచాలి.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు:
పరీక్షలకు ముందు చేయవలసిన పనులు:
12. మొదటగా మీ పాఠశాలలోని ఉపాధ్యాయుల ద్వారా విద్యార్ధులకు సబ్జెక్టువారీ సిలబస్ లను తెలియజేయండి. పరీక్షల టైం టేబుల్ తెలియపరచండి.
13. పరీక్షల ముందు రోజు వరకు టైం టేబుల్ ప్రకారం ఉపాధ్యాయులు సిలబస్ ను పునఃశ్చరణ చేయునట్లు చూడండి.
పరీక్షల సమయంలో చేయవలసిన పనులు:
14. 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.
15. అన్ని తరగతుల వారికి సబ్జెక్ట్ వారీగా పరీక్షా సమయం టైం టేబుల్ ప్రకారమే అనుమతించాలి. పరీక్షల అనంతరం చేయవలసిన పనులు
16. ఉపాధ్యాయులు వారివారి సబ్జెక్టులలో స్వయముగా కీ తయారుచేసికొని విద్యార్ధుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబు పత్రములను మూల్యాంకనము చేయాలి. విద్యార్ధులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబు పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్ధం భద్రపరచాలి.
17. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి 09.12.2023 తేదీ విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో SA-I నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.