🌷దసరా.. సంక్రాంతి సెలవులు.. suffix.. preffix పై వివరణ🌷 🔅 సెలవులు(దసరా/సంక్రాంతి) 9 రోజులు ప్రకటించినపుడు(ఆదివారం తో కలిపి) చివరి రోజు గానీ,బడి తెరిచే రోజు గానీ(రెండింటి లో ఒకటి మాత్రమే) సాధారణ సెలవు(CL) పెట్టుకోవచ్చు. 【మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు 10 అవుతాయి.ఇబ్బంది లేదు.】 🔅 సెలవులు(దసరా/సంక్రాంతి) 10 లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు చివరి రోజూ, బడి తెరిచేరోజు(రెండు రోజులు)తప్పక బడికి వెళ్ళాలి.అలా వెళ్లకపోతే మొత్తం సెలవులకి అర్హత గల సెలవు పెట్టవలసి ఉంటుంది. అనగా EL/MCL/HPL/EOL లలో ఏదోఒకటి పెట్టవలసి ఉంటుంది.
(RC.NO.10324 తేదీ:7.11.1969)
【మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు 11,12,13,14,15 రోజులు అవుతాయి.కాబట్టి CL కి అవకాశం లేదు.】
🔅 సెలవులు(దసరా/సంక్రాంతి) 15 లేక 16 లేక 17......etc రోజులు(ఆదివారం తో కలిపి) ప్రకటించినపుడు బడి చివరి రోజు గానీ,బడి తెరిచేరోజు గానీ(రెండింటి లో ఒక రోజు మాత్రమే) అర్హత గల సెలవు పెట్టుకోవచ్చు. అర్హత గల సెలవు అనగా EL/HPL/MCL లలో ఒకటి 1 రోజు కోసం వాడుకోవచ్చు.
(RC. NO.815 తేదీ:1.9.1999)
【మీరు 1 రోజు సెలవు పెట్టిన మొత్తం రోజులు 16,17,18.....etc అవుతాయి.】