2023-24 విద్యా సంవత్సరానికి గాను పాఠశాల విద్యకు అకడమిక్ క్యాలెండర్ విడుదల . ఈ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవులు కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఏడాదిలో 88 రోజులు సెలువులు ఉంటాయి. మొత్తం 229 రోజులు బడులు జరగనున్నాయి. జనరల్ పాఠశాలలకు దసరా సెలువులు అక్టోబర్ 14 తేదీ నుండి 24వ తేదీ వరకు 11 రోజులు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 9తేదీ నుండి 18వ తేదీ వరకు ఉంటాయి. వీరికి క్రిస్టమస్ సెలువు డిసెంబర్ 25వ తేదీన ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. అయితే క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలకైతే అక్టోబర్ 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు, క్రిస్టమస్ సెలవులు డిసెంబర్ 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు, సంక్రాం తి సెలవులు జనవరి పదో తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఉంటాయి.
స్కూల్ అకడమిక్ కేలండర్స్ 2023-24 విడుదల.
స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్,
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు,
లాంగ్వేజ్ మేళా, క్లబ్, ల్యాబ్స్,
లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్,
లెర్న్ ఏ వర్డ్ ఏ డే,
తెలుగు భాషా వారోత్సవాలు,
కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్ క్యాలెండర్.
Assessments:
FA-1/CBA 1: Aug 1-4,
FA-2: Oct 3-6,
SA-1: Nov 4-10,
FA-3/CBA 2: Jan 3-6,
FA-4:Feb 23-27,
SSC Pre-final 2024 Feb 23-29
SA-2/CBA 3: Apr 11-20
Holidays:
Dasara: 14-10-2023 to 24-10-2023
Christmas: 17-12-2023 to 26-12-2024 for Missionary Schools
Pongal: 09-01-2024 to 18-01-2024