♦️ పాఠశాల ప్రారంభించుటకు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.
♦️ సెప్టంబరు 21 న టీచర్లందరూ హాజరు కావాలి.
♦️ తదుపరిప్రణాళికలు తయారు చేసుకోవాలి 22 నుండి ప్రతిరోజూ 50% టీచర్లు బడికి రావాలి.
♦️ ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండే విద్యను అభ్యసించాలి
♦️ తొమ్మిదో తరగతి నుండి 12 వ తరగతి విద్యార్థులు పాఠశాలకు రావచ్చు
♦️ రోజువారీ షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఈ నెల 21వ తేదీ నుండి ప్రభుత్వ ఉన్నత. పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ 100% పాఠశాలకు హాజరు కావాలని పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పైన పేర్కొన్న ఉత్తర్వులలో డే వైస్ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు... దాని ప్రకారం
ఈ సంవత్సరం 9 వ తరగతి మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ తమ తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు హాజరు కావచ్చు ఇది నిర్బంధం కాదు స్వచ్ఛందంగా పిల్లలు రావచ్చు...
21-09-2020 :- పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాఠశాలకు విధిగా హాజరు(report) అవ్వాలి.
చేయవలసిన పనులు :- 22 వ తేదీ నుండి 50 శాతం చొప్పున పాఠశాల కు ఉపాధ్యాయులు హాజరయ్యే విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని కావాలి..
పేరెంట్ కమిటీ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక తరగతుల గురించి వివరించి కోవిడు2019 నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలి...
పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరినీ రెండు భాగాలుగా విభజించాలి
22-09-2020 :- మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులందరూ 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క పూర్వపు తరగతి అనగా కిందటి సంవత్సరం వాళ్ళు ఏ క్లాసు చదివారు (10 వాళ్ళు 9, 9 వాళ్ళు 8) ఆ క్లాసులు సంబంధించినటువంటి (learning outcomes) తెలుసుకోవడం కోసం ప్రణాళికను రూపొందించుకుని అది పిల్లలకి తెలియజేసి ఇ గత సంవత్సరం వాళ్ళు ఏమి నేర్చుకున్నారు వాటికి సంబంధించిన సామర్ధ్యాలను తెలుసుకోవడానికి టైం టేబుల్ ఇవ్వాలి... దీనికి వర్క్షీట్లను తయారుచేసి పిల్లలకి ఇవ్వాలి...
23-09-2020 :- అదేవిధంగా రెండవ బ్యాచ్ కి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులు చేసిన విధంగా గత సంవత్సరం సామర్థ్యాలను పరీక్షించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యార్థులకు తెలియజేసి వాళ్ళకి మార్గదర్శ కాలను ఇవ్వాలి..
24-09-2020 :-
26-09-2020 :-
29-09-2020 :-
ఈ మూడు రోజులలో మొదటి బ్యాచ్ కి సంబంధించిన ఉపాధ్యాయులు.. పిల్లలకు కండక్ట్ చేసిన టెస్ట్ రిజల్ట్స్ ఎనలైజ్ చేసి దానిని బట్టి రోజువారీ షెడ్యూల్ను అలాట్ చేసి మానిటర్ చేయాలి..... ఇది రెమిడియల్ టీచింగ్ మాత్రమే పాఠశాల రీ ఓపెన్ అయ్యేవరకు రెగ్యులర్ తరగతులను అనగా textbook lessons ను చెప్పాల్సిన పని లేదు.
25-09-2020 :-
28-09-2020 :-
30-09-2020 :-
ఈ మూడు రోజులు రెండవ బ్యాచ్ ఉపాధ్యాయులు కూడా మొదటి బ్యాచ్ ఉపాధ్యాయులు చేసిన విధంగానే చేయాలి
ఉపాధ్యాయులు బోధించే రెమిడియల్ (కిందటి తరగతి వి) పిల్లల సామర్థ్యాన్ని బట్టి ఉండాలి అనగా పిల్లలందరినీ హైటెక్, లో టెక్ , నో టిక్ విభజించి దాని ప్రకారం తరగతులు నిర్వహించాలి...
Second round గైడ్ లైన్స్ వచ్చే వరకు ఈ సూచనలను కంటిన్యూ చెయ్యాలి...
CSE వారి తాజా ఉత్తర్వులు Proc Rc No 151 dt.10.8.20
ఈ నెల 21 న 100% ఉపాధ్యాయులు 22నుంచి 4-10-2020 వరకు అన్ని పాఠశాలల యందు ప్రతిరోజు 50% ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాలి: CSE వారి తాజా ఉత్తర్వులు Rc.No.151/A&I/2020 Dated:10/09/2020
UNLOCK 4 .0 మార్గదర్శకాలు
Click here to download proceedings ⬇️