2020_21_ప్రాథమిక_పాఠశాలల_అకడమిక్_క్యాలెండర్
PROPOSED ACADEMIC CALENDER Primary
181 పని దినాలతో ప్రతిపాదిత ప్రాధమిక అకడమిక్ క్యాలెండర్
ప్రైమరీ స్కూళ్ల అకడమిక్ క్యాలెండర్ రెడీ
2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్ రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్ క్యాలెండర్ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. సన్నాహక క్యాలెండర్ ప్రకారం ... వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు. సెప్టెంబరులో 21 రోజులు, అక్టోబరులో 21 రోజులు, నవంబరులో 24 రోజులు, డిసెంబరులో 25/22 రోజులు, జనవరిలో 20/23 రోజులు, ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 25 రోజులు, ఏప్రిల్లో 21 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద 2022-21లో 181 పనిదినాలు ఉంటాయి.
పరీక్షల ప్రణాళిక:
👉నిర్మాణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు అక్టోబరులో,
👉సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో,
👉నిర్మాణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు మార్చిలో,
👉సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్లో జరుగుతాయి.
సెలవుల ప్రణాళిక:
♨️దసరా 2.10.2020-26.10.2020, ♨️క్రిస్టమస్ 24.12.2020 - 28.12.2020,
♨️సంక్రాంతి 12.01.2021- 17.01.2021,
♨️వేసవిసెలవులు 24.04.2021-11.06.2021
కాలనిర్ణయ పట్టిక:
1 నుంచి 5 తరగతులకు మొదటి పీరియడ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్లు ఉంటాయి. కాగా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్-3, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్-4, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్-5లలో మూడేసి పాఠాలను తొలగించారు.
Click here to download ⬇️