ఆన్ లైన్ లో ఆరోగ్య కార్డులు.. గుర్తింపు లేనివారికి అవకాశం.... నేరుగా దరఖాస్తుకు వీలు..
➧గుర్తింపు లేనివారికి అవకాశం.
➧నేరుగా దరఖాస్తుకు వీలు.
➧దరఖాస్తుకు అవసరమయ్యే వివరాలు ఇవే..
➤రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గుర్తింపు కార్డును ఇకపై ఆన్లైన్లో పొందవచ్చు.
➤ఉద్యోగి , వారిపై ఆధారపడే వారి వివరాలు ఇందులో నమోదై ఉంటాయి.
➤వీరిలో ఎవరైనా అనారోగ్యం పాలైనా ఆసుపత్రికి వైద్యం కోసం వెళితే ఈ కార్డును చూపించాల్సి ఉంటుంది.
➤గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ హెచ్ సీకి సంబంధిం చి ముగ్గురు ఉద్యోగులతో ఒక విభాగం ఉంది.
➤ఉద్యోగి ఈ విభాగంలో సంప్రదిస్తే వారు కార్డును ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయానికి పంపించి ఆమోదం పొందుతారు.
➤ఆ తర్వాత రోగిని ఆసుపత్రిలో చేర్చుకుంటారు.
➤వాస్తవానికి ఎనిమిదేళ్ల కిందట ఈ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టినా ఆరేళ్లుగా చాలా మందికి కార్డులు లేవు .
➤ఉన్న వాట్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నా జరగడం లేదు .
➤ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఆన్లైన్లో పొందడానికి అవకాశం ఇచ్చింది .
➤దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది ఉద్యోగులకు తీరనుంది .
జత చేయాల్సినవి ఇవీ
➤ఎస్ఆర్ , ఫొటోలు.
➤పుట్టిన తేదీకి సంబందించి టెన్త్ ధ్రువీకరణ పత్రం.
➤ఉద్యోగిపై ఆధారపడిన వారి వివరాలు.
➤ఉద్యోగి తో ఉన్న సంబంధం పేర్కోవాలి.
➤అందరి ఆధార్ కార్డుల నెంబర్లు ఇవ్వాలి.
➤ఐదేళ్లలోపు పిల్లలుంటే వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జతచేయాలి.
➤వికలాంగులు ఉంటే వారి వివరాలు
➤వైద్యులు ధ్రువీకరణ పత్రం.
➤జత చేసిన అన్ని పత్రాలు స్కానింగ్ చేసి పంపాలి.
ఆన్లైన్లో దరఖాస్తులకు అవసరమయ్యే వివరాలు ఇవీ . . .
➤కార్డు కోసం గుర్తింపు నెంబరు అంటే ట్రెజరీ అధికారులు కేటాయించిన గుర్తుంపు నెంబరు పొందుపర్చాలి . .
➤పింఛను పొందుతున్న వారైతే పీవోసీ పేరుతో ట్రెజరీ అధికారులు కేటాయించిన నెంబరు తీసుకోవాలి .
➤ఆ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్ లో రాసిన పేరు ఆధార్ నెంబరు , ఎస్ఆర్ ప్రారంభ సమయంలో ఇచ్చిన గుర్తింపు ఐడీ ఉంచుకోవాలి.
➤ఎస్ఆర్లో రాసిన వివరాల ఆధారంగా పుట్టిన తేదీ , వైవాహిక స్థితి , కులం , జాతీయత , నివాసం , ఇంటి చిరునామ , ఈ - మెయిల్ ఐడీ , మొబైల్ నెంబరు ఇవ్వాలి .
➤కుటుంబ సభ్యుల్లో వికలాంగులు ఉంటే వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలి .
➤రేషన్ కార్డ్ నెంబరు, టెన్త్ సర్టిఫికెట్ లో పేర్కొన్న రెండు పుట్టుమచ్చల వివరాలు తెలపాలి.
➤ఏ శాఖలో పనిచేస్తున్నారు , ఉద్యోగం వివరాలు , పేస్కేల్, ప్రస్తుతం పొందుతున్న వేతనం వివరాలు నమోదు చేయాలి .
నమోదు ఇలా . . .
➤ముందుగా ehs.gov.in అనే వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి.
➤ఆ ఉద్యోగి కోడ్ , User ID, వేతన చెల్లింపు అధికారి కేటాయించిన పాస్వర్డ్ ఉపయోగించాలి.
➤ఉద్యోగి పేరు నమోదు చేశాక ఆధార్ కార్డు నెంబరు నమోదు చేయాలి.
➤క్లిక్ హియర్ ఫర్ రిఫరెన్స్ ఆప్షన్ వచ్చాక అందులోనూ ఆ ధార్ నెంబర్లు నమోదు చేయాలి.
➤దరఖాస్తులో అన్ని వివరాలు నమోదు చేశాక తప్పులే మైనా ఉంటే వాటిని సరిచేసి మళ్లీ నమోదు చేయాలి.
➤ప్రింట్ కాపీపై సంతకం చేశాక ఆన్లై లో ఆప్లోడ్ చేయాలి.
➤ఆ వివరాలు నింపి సంతకం చేసిన దరఖాస్తు ప్రింటు వేతన చెల్లింపు అధికారికి అందజేయాలి.
➤ఉద్యోగి , కుటుంబ సభ్యుల ఫొటోలు , ఎస్ఆర్ మొదటి రెండు పేజీలు స్కాన్ చేసి దరఖాస్తుతో పాటు ఇవ్వాలి.
➤బయోమెట్రిక్ విధానంలో జీతాలు చెల్లించే అధికారికి దరఖాస్తు ఇచ్చిన ప్పుడు కుటుంబ సభ్యుల వేలిముద్రలు ఇవ్వాలి.
➤జీతం చెల్లించే అధికారికి అన్ని వివరాలు ఆధారాలతో అందించాక ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు అందినట్లు రశీదు తీసుకోవాలి.
➤అన్ని వివరాలు ఆన్ లైన్లో పొందుపర్చాక 15 రోజుల్లో కార్డు సిద్ధంగా ఉందన్న సమాచారం ఈ మెయిలకు లేదా ఫోన్ నెంబర్ కు వస్తుంది.
➽click here to Apply Now
http://www.ehs.ap.gov.in/EHSAP/loginAction.do?actionFlag=logout