సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు జనవరి 28 నుండి ఫిబ్రవరి 4 వరకు జరుగును.
ఎస్‌సీఈఆర్టీ మార్గదర్శకాలు
పాఠశాల విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ-1) పరీక్షల షెడ్యూలుతో పాటు నమూనా ప్రశ్నపత్రం(బ్లూ ప్రింట్)ను ఎన్‌సీఈఆర్టీ విడుదల చేసింది. ఈమేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. పరీక్షలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహిస్తారు.
పరీక్షలు రాయడానికి 2.45 గంటల సమయం కేటాయించగా.. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల సమయం కేటాయిస్తూ బ్లూప్రింట్లు విడుదల చేశారు.
ఎస్‌ఏ-1 పరీక్షల షెడ్యూలు
1-5 తరగతులకు.: ఈ నెల 28న తెలుగు, 29న ఆంగ్లం, 31న గణితం, ఫిబ్రవరి ఒకటో తేదీన 3, 4, 5 తరగతులకు పరిసరాల విజ్ఞానం పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.
6-10 తరగతులకు.: 6, 7, 8, 10 తరగతులకు 28న తెలుగు, 29న హిందీ, 31న ఆంగ్లం, వచ్చే నెల ఒకటో తేదీన గణితం, 2న 6,7 తరగతులకు జనరల్‌సైన్సు, 8, 10 తరగతులకు ఉదయం భౌతికశాస్త్రం, మధ్యాహ్నం జీవశాస్త్రం, 3న సాంఘికశాస్త్రం, 9వ తరగతికి 28న తెలుగు-1, 2, 29న హిందీ, 31న ఆంగ్లం-1, 2, వచ్చే నెల ఒకటో తేదీన గణితం-1, గణితం-2, రెండో తేదీన భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, 3న సాంఘికశాస్త్రం-1, 2 పరీక్షలు జరుగుతాయి. 4న కాంపోజిట్ కోర్సు పరీక్షలు ఉంటాయని మార్గదర్శకాల్లో వివరించారు. 6, 8, 10 తరగతులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, ఏడో తరగతికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 వరకు పరీక్షలు జరుగుతాయి. తొమ్మిదో తరగతికి రెండు పూటలా నిర్వహిస్తారు.
AP SCERT PROCEEDINGS& TIME TABLE.
1 నుండి 5వ తరగతి వరకు సిలబస్, బ్లూప్రిoట్.
6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సిలబస్, బ్లూ ప్రిoట్
Summative Examination -1 (SA-1)
28.01.2022 to 04.02.2022
FA-3 : February.
FA-4 : March.
SA-2 : April.
last working day for Classes 1st to 9th Classes is 30.04.2022.