మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఫైనల్ తరగతి లో చదివి, ఆపైన తదుపరి చదువుల కోసం వేరే పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులకు టీసీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మన దగ్గరకు వచ్చేవాళ్లకు కూడా TC సబ్మిట్ చేయమని ఒత్తిడి చేయకూడదు. కేవలం విద్యార్థి తల్లిదండ్రుల నుండి ఒక డిక్లరేషన్ తీసుకుని వాళ్ళు వెళ్లబోయే పాఠశాలలకు మనమే ఆన్లైన్ లో విద్యార్థిని పంపిస్తాము. ఆ రకంగా స్టూడెంట్ ట్రాన్స్ఫర్ మ్యాపింగ్ అప్లికేషన్ తయారు చేయబడింది.
ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం కాబట్టి ఈ రాష్ట్రం వరకే చెల్లుబాటు అవుతుంది. మన విద్యార్థులు వేరే రాష్ట్రాలకు వెళ్లాలన్నా లేదా వేరే రాష్ట్రం విద్యార్థులు ఈ రాష్ట్రంలో చేరినప్పుడు కూడా టీసి తప్పనిసరి. అది ఎలా చేయాలి అన్నది క్రింద యూజర్ మాన్యువల్ లో ఉంది. తల్లిదండ్రులు ఇవ్వాల్సిన డిక్లరేషన్ యొక్క నమూనా కూడా అందులో ఉంది.
.
గౌరవ కమిషనర్ , పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు Rc.No.ESE02-30/83/2019-A&I -CSE dated 12.04.2024 అనుసరించి ఈ సంవత్సరం మన పాఠశాలలలో తదుపరి ఉన్నత తరగతులు లేని పాఠశాలల చివరి తరగతి విద్యార్థులను.
అనగా రెండవ తరగతి వరకు మాత్రమే ఉన్న చోట నుండి రెండవ తరగతి పూర్తి అయిన విద్యార్థులను దగ్గర్లోని మూడో తరగతి ఉన్న పాఠశాలలకు.
ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్న పాఠశాలల నుండి 5వ తరగతి పూర్తి అయిన విద్యార్థులను దగ్గర్లోని ఆరో తరగతి ఉన్న పాఠశాలలకు
అదేవిధంగా యుపి స్కూల్స్లో ఏడు లేదా ఎనిమిదో తరగతి వరకు మాత్రమే ఉన్న పాఠశాలల నుండి తదుపరి తరగతులు 8 లేదా 9వ తరగతి ఉన్న పాఠశాలలకు.
విద్యార్థులను స్టూడెంట్ ఇన్పో వెబ్సైట్లో ముందుగా మ్యాప్ చేయవలసి ఉంది.
ఇందుకోసం పిల్లల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రములను తీసుకొని దానికి అనుగుణంగా ఆ పాఠశాలలకు విద్యార్థులను మాప్ చేయవలెను మరియు విద్యార్థులను ఆ పాఠశాలలకు తీసుకువెళ్లి అడ్మిషన్ కన్ఫామ్ చేయించినట్లయితే ఆన్లైన్లో కూడా విద్యార్థులు ఆ పాఠశాలలలోకి వెళతారు.
ఈ ప్రక్రియని ఏప్రిల్ 23,2024 అనగా చివరి పని దినం లోపు ఖచ్చితంగా పూర్తి చేయవలసి ఉంటుంది.
మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్పిలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించవలెను.
రోజువారి ప్రగతి మండల లాగిన్ లో వెరిఫై చేసుకోవచ్చును.
జిల్లా ప్రోగ్రెస్ ను రాష్ట్ర అధికారులు 15వ తారీకు నుండి మానిటర్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఈ ప్రక్రియలో ఉన్న పాఠశాలల వివరాలు కూడా మీకు అందజేయడం జరుగుతుంది.
ఇవి కాకుండా ఏవైనా అదనంగా ఉన్న పాఠశాలలను కూడా మీరు గుర్తించినట్లయితే వాటిలో కూడా విద్యార్థులను పాఠశాలలకు మాప్ చేయమని సూచించడం అయినది.