ఆగస్టు 1 నుంచి 15 వరకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు
కార్యక్రమాల వివరాలు ఇలా..
విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపనున్న హర్ ఘర్ తిరంగా
ప్రతి ఇంటా జాతీయ జెండ
13 నుంచి 15 వరకూ ప్రతి ఇంటా జాతీయ పతాకం రెపరెపలు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేం దుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసింది
ఆగస్టు 1 నుంచి 15 వరకూ రోజు వారీ కార్యక్రమాలను అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు
13 నుంచి 15 వరకూ ప్రతి ఇంటి పైనా జాతీయ పతాకం రెపరెప లాడే విధంగా విద్యార్థులు , ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు చర్యలు
గతంలో ఫ్లాగ్ కోడ్లో ఉన్న నిబంధనలను సవరించి మూడు రోజుల పాటు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగిరేందుకు అవకాశం
13 నుంచి 15 వరకూ మూడు రోజుల పాటు ప్రతి రోజు ఉదయం దేశభక్తి గేయాలతో జాతీయ పతాకాలను చేతబట్టి నగర సంకీర్తన చేస్తూ గ్రామంలో పర్యటించనున్నారు . ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామ కూడళ్ళలో వినిపించనున్నారు.
కార్యక్రమాల వివరాలు
ఆగస్టు 1 న విద్యార్థులు , ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
2 వ తేదీన జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి
3 న గుర్తింపునకు నోచుకోని స్వాతంత్ర్య సమరయోధులతో సమావేశం
4 న పాఠశాల స్థాయిలో దేశ భక్తి గేయాల పోటీ
5 న దేశ భక్తి పూరితమైన నాటకం , ఏకపాత్రాభినయ పోటీ
6 న దేశ భక్తి ఆధారిత ప్రదర్శన.
7 న పాఠశాల నివాస ప్రాంతంలో ర్యాలీలు.
8 న చిత్ర లేఖనం , పెయింటింగ్ , వక్తృత్వ పోటీలు.
9 న దేశ భక్తి ప్రబోధాత్మక సాంస్కృతిక పండగను జరపడం.
10 న పోస్టర్ తయారీలో పోటీల నిర్వహణ.
11 న వారసత్వ నడక పేరిట దేశ భక్తుల విగ్రహాలను శుభ్రపర్చడం.
12 న ఆటల పోటీల నిర్వహణ.
13 న జాతీయ పతాకాలతో తీసుకున్న సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం.
దీనికోసం విద్యార్థుల సెల్ ఫోన్లను అనుమతించకూడదు .
14 న స్వాతంత్ర్య సమరయోధుల ఇళ్ళకు వెళ్ళి వారిని , వారి కుటుంబ సభ్యులను సత్కరించడం.
15 న ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ.
అన్ని పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్
►ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశం.
► దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు.. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించాలి.
► దేశభక్తి గీతాల పోటీలు,
► వ్యాసరచన,
► వకృత్వ ,
► ర్యాలీలు,
► నాటక,
► డ్యాన్స్,
► పెయింటింగ్,
► క్విజ్
పోటీలను నిర్వహించాలి.
► ఆగస్టు 11 నుంచి 15 వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
► ఆగస్టు 13న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలతో సెల్ఫీ ఫోటోలు దిగి వాటిని www.harghartiranga.com వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
⬇️