పాఠశాలల్లో వివిధ సమస్యల పై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న అన్ని రకాల పాఠశాలల్లోని వివిధ రకాల సమస్యల పరిష్కారానికి, ఫిర్యాదులకు కొరకు మరియు ప్రభుత్వ కార్యక్రమాల పై స్పందన కొరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం టోల్ ఫ్రీ నెంబర్ 14417 ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రజలు అందరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించి పాఠశాలల్లో ఈ కింది అంశాలపై వారి అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను ఇవ్వవచ్చు.
1.జగనన్న గోరుముద్ద కార్యక్రమం లో భాగంగా విద్యార్థులకు అందజేస్తున్న భోజనం యొక్క నాణ్యత
2.పాఠశాలల్లోని మరుగుదొడ్ల పరిశుభ్రత
3విద్యార్థులకు అందజేస్తున్న విద్య కానుక
4స్కూల్ మెయింటినెన్స్
5ఉపాధ్యాయుల గైర్హాజర్ వారు అందిస్తున్న విద్యపై నాణ్యత
ప్రధాన ఉపాధ్యాయులు అందరూ టోల్ ఫ్రీ నెంబర్ ను పాఠశాల ప్రహరీ గోడలపై మరియు తల్లిదండ్రులకు కనిపించే విధంగా ఉన్న ప్రదేశాలలో పెయింటింగ్ వేయాల్సి ఉంటుంది. దీని కొరకు నమూనా వాల్ పోస్టర్ను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసింది.
ప్రధానోపాధ్యాయులు ఈ వాల్ పెయింటింగ్ కొరకు పాఠశాల నిర్వహణ నిధుల నుండి లేదా స్కూల్ సేఫ్టీ నిధుల నుండి 500 రూపాయలు మించకుండా వినియోగించుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు పెయింటింగ్ వేయించిన ఫోటోలను ఐ ఎం ఎం ఎస్ యాప్ లో జనరల్ ఫోటో క్యాప్టూర్ లో ఈ ఫొటోలను అప్లోడ్ చేయాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశించారు. ఇక్కడ క్లిక్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ కేటాయింపు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోండి ఈ క్రింద నమూనా వాల్ పోస్టర్ కలదు చూసి గోడలపై పెయింటింగ్ వేయించ వలెను.