హెచ్ఎం పోస్టుల మంజూరు
✥ అప్గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల సమస్యలు తీరనున్నాయి.
✥ గత మూడేళ్ల కాలంలో ఆయా జిల్లాల్లో యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేశారు.
✥ హోదా పెంచారే కానీ పోస్టుల కేటాయింపు లేదు. హెచ్ఎం పోస్టుతో పాటు స్కూల్ అసిస్టెంట్లు తగినంత మందిలేరు. దీనిపై ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
✥ నిరుపయోగంగా ఉన్న క్రాప్ట్, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులను రద్దు చేసి వాటిస్థానంలో హెచ్ఎం పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు.
✥ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 16లోగా పంపించాలని డీఈవోలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు.