స్థానిక అవసరముల దృష్ట్యా విద్యా సంవత్సరములో (జూన్ నుండి-ఏప్రిల్ వరకు) మూడు రోజులు
స్థానిక సెలవులు స్వయం నిర్ణయ సెలవు దినాలుగా ప్రకటించే అధికారం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కల్పించారు. అయితే పర్యవేక్షణ అధికారులకు ముందుగా తెలియజేయాలి.
G.O.Ms.No.308 Edn తేది:19-02-1970
LOCAL HOLIDAYS:
ఎలా తీసుకోవాలి-ఎప్పుడు తీసుకోవాలి
లోకల్ హాలిడేస్ విద్యా సంవత్సరంలో 3 కు మించి (జూన్ నుండి ఏప్రిల్) ఇవ్వరాదు.
LH ప్రకటించడానికి అవకాశమున్న రోజులలో కొన్ని ఉదాహరణకు మాత్రమే
⭐ గ్రామ దేవత పండుగ
⭐ స్ధానిక జాతర
⭐ ముఖ్యమైన పండుగ
⭐ నాగుల చవితి
⭐ కార్తీక సోమవారం
⭐ దీపావళి ముందు రోజు
⭐ మహా శివరాత్రి మరుసటి రోజు
⭐ హేబిటేషన్/పాఠశాల పరిధిలో*
⭐ అత్యంత ప్రాధాన్యత కల్గిన/ అవసరమైన రోజు
గమనిక- School Level Local Holidays ముఖ్యమైన/ స్థానిక ప్రాధాన్యమున్న రోజున "విద్యార్ధుల కోరిక మేరకు సహోపాధ్యాయులతో సంప్రదించి DyEO/ MEO కు ముందు రోజున సమాచారం ఇచ్చి" ప్రధానోపాధ్యాయుడు LH ప్రకటించవచ్చు