JGM మరియు TMF 4 అంచెల పర్యవేక్షణ వ్యవస్థ లో ప్రధానోపాధ్యాయులు యొక్క రోజువారీ పనులు.
1. రోజువారీ హాజరును యాప్ నందు నమోదు చేయాలి. 2. TMF యొక్క రోజువారీ ఇన్స్పెక్షన్ ను సమర్పించాలి. ఖచ్చితత్వం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ vs మాన్యువల్‌గా నమోదు చేసిన టాయిలెట్ ఫోటోను పోల్చాలి. 3. MDM యొక్క రోజువారీ ఇన్స్పెక్షన్ ను సమర్పించాలి. 4. HM లాగిన్‌లో ATR మాడ్యూల్‌ని తరచుగా తనిఖీ చేయడం వలన ఏదైనా టిక్కెట్లు జనరేట్ అయ్యాయా/పెండింగ్‌లో ఉన్నాయా/మూసివేయబడినాయా అనేది గమనించాలి. ఏదైనా టికెట్ జనరేట్ చేయబడితే, అది పరిష్కరించబడాలి. ఒకవేళ అ పరిష్కరించబడనట్లయితే రిమార్కు చేయబడిన ఇమేజ్ను వ్యాఖ్యలతో పాటు కాంపోనెంట్‌కు సమర్పించాలి. అప్పుడు అది మూసివేయబడడం కోసం MEO /DyEO లాగిన్ కి వెళ్తుంది. 5. సరఫరాదారు నుండి గుడ్లు స్వీకరించే సమయంలో నెలలో 3 సార్లు ప్రతి 10 రోజులకు గుడ్డు రశీదు (HM సేవలో) అప్డేట్ చేయడం. 6. ప్రతి 15 రోజులకు చిక్కి స్వీకరించినప్పుడు యాప్‌లో రసీదుని అప్డేట్ చేయడం 7. ఏదైనా పారామీటర్‌పై నిర్దిష్ట శ్రద్ధ అవసరమా అని చూడటానికి డాష్ బోర్డు లో MDM పారామీటర్ ను తనిఖీ చేయాలి. 8. నిర్దిష్ట శ్రద్ధ అవసరమా కాదా అని డాష్ బోర్డు లో TMF యొక్క పారామీటర్ ను తనిఖీ చేయాలి. 9. అప్డేట్ కోసం యాప్‌లోని నోటిఫికేషన్లు/ వీడియో లింక్‌లను తరచుగా తనిఖీ చేయాలి. 10. కిచెన్ గార్డెన్, TMF మెటీరియల్స్, రసీదులు మొదలైన NON - డైలీ మాడ్యూల్స్‌లో ఎంట్రీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.