Income Tax Rules: మీ ఇంట్లో ఎక్కువగా నగదు నిల్వ చేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కొంతమంది వ్యాపారస్తులు ఇంటి వద్ద చాలా నగదు ఉంచుకొని పట్టుబడుతున్నారు. నగదు పరిమితికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలని జారీ చేసింది. వీటి గురించి తెలియక చాలామంది ఇబ్బందిపడుతున్నారు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.
ఈ విషయాలు గమనించండి..
1. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే జరిమానా విధిస్తారు.
2. ఒకేసారి రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ నంబర్ అందించాలి.
3. ఒక వ్యక్తి 1 సంవత్సరంలో 20 లక్షల రూపాయల నగదు డిపాజిట్ చేస్తే అతను పాన్ , ఆధార్ సమాచారాన్ని అందించాలి.
4. పాన్, ఆధార్ గురించి సమాచారం ఇవ్వకుంటే రూ.20 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
5. మీరు రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదుతో షాపింగ్ చేయలేరు.
6. 2 లక్షలకు మించి నగదు రూపంలో కొనుగోళ్లు జరిపితే పాన్, ఆధార్ కార్డు కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.
7. రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు, అమ్మకాలు జరిపే వ్యక్తులు దర్యాప్తు సంస్థల పరిధిలోకి వస్తారు.
8. క్రెడిట్-డెబిట్ కార్డ్ కార్డ్ చెల్లింపు సమయంలో ఒక వ్యక్తి రూ.1 లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినట్లయితే అప్పుడు విచారణ చేయవచ్చు.
9. 1 రోజులో మీ బంధువుల నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోకూడదు. ఇది బ్యాంకు ద్వారా మాత్రమే జరగాలి.
10. నగదు రూపంలో విరాళం ఇచ్చే పరిమితిని రూ.2,000గా నిర్ణయించారు.
11. ఏ వ్యక్తి మరో వ్యక్తి నుంచి నగదు రూపంలో 20 వేలకు మించి రుణం తీసుకోకూడదు.
12. బ్యాంకు నుంచి రూ.2 కోట్ల కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.