మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత.
గత సమీక్షా సమావేశాల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెనూలో తీసుకువస్తున్న మార్పులపై సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. మొత్తంగా రూ. 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. మొత్తంగా రూ. 1294 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి అంతటా నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందన్నారు.
----------------------------------------
మెనూ వివరాలు:
సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి
మంగళవారం : పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి