మన పాఠశాలకు అందించే బియ్యం 🌾
పోర్టిపైడ్ బియ్యం ......గురించి 🥣🥣
పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు, సప్లిమెంట్లు కలపడాన్నే ఫార్టిఫైడ్ అంటారు.
అంటే ఆహారాన్ని బలవర్థకం చేయడమే ఫార్టిఫైడ్‌గా పరిగణిస్తారు.
బియ్యం, ఇతర ఆహార ధాన్యాలలో ఫార్టిఫైడ్ రైస్ కెన్నెల్స్ కలిపి సరఫరా చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది.
ఇప్పటికే కేంద్రం కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మక పంపిణీ ప్రారంభించింది.
ఫార్టిఫైడ్ రైస్ కెన్నెల్స్ ఎలా తయారుచేస్తారు?
బియ్యాన్ని పిండిగా మార్చి
దానికి
ఐరన్,
జింక్,
ఫోలిక్ యాసిడ్,
విటమిన్ బి-12 వంటి విటమిన్లు, పోషకాలను కలిపి అనంతరం ఆ పిండిని బియ్యం పోలికతో కెన్నెల్స్‌గా మార్చుతారు.
ఇలా తయారు చేసే పరిశ్రమలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆయా పరిశ్రమల నుంచి మిల్లర్లకు కేంద్రం ఈ ఫార్టిపైడ్ రైస్ కెన్నెల్స్ సరఫరా చేస్తుంది.
ప్రతి క్వింటాలు బియ్యానికి 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ కెన్నెల్స్ కలుపుతారు.
అంటే ఒక కేజీకి 10 గ్రాములు.
ఇవి నీటి పై తేలియాడు తాయి.
MDM వారు పారపోయకుండా ఒడిసి పట్టి వేసి అన్నం వండాలి.