PD Accounts Complete Details
మన School/MRC/Complex అకౌంట్స్ PD Accounts Green Channel లో మార్చాలి
గ్రీన్ ఛానల్ ద్వారా P.D. అకౌంట్స్ ఓపెన్ చేయడం కోసం స్టేట్ ఆఫీస్ వారి ఆదేశాలు ప్రకారము.
Frequently Asked Questions(FAQs)
1. అన్ని పాఠశాలలకు సమాచారం ఇవ్వాలా?
జ. అవును. ప్రభుత్వమేనేజ్మెంట్ లో పనిచేస్తున్న పాఠశాలలన్నింటికీ సమాచారం ఇవ్వాలి.
2. Organisation Unit in CFMS అంటే ఏమిటి?
జ. ప్రతి నెల జీతాలు కోసం ట్రెజరీ డీటెయిల్స్ పంపేటప్పుడు Org ఐ.డి గా వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ లో కనిపిస్తుంది. దానినే
ఆర్గనైజేషన్ ఐ.డి అంటారు.
3. కాంప్లెక్స్ హెచ్.ఎమ్ కు అవసరం లేదు అని తెలిసింది, ఎంతవరకు నిజం?
జ. అన్ని SMCS, CRCs మరియు MRCS ఖచ్చితంగా ఈ సమాచారాన్ని పంపాలి.
4. PD అకౌంట్ ఓపెనింగ్ కోసం వివరాలు ఎందుకు అడగు చున్నారు?
జ. ఎస్ఎస్ఎ ద్వారా ఈ వివరాలు పంపితే నిధులు నేరుగా గ్రీన్ ఛానల్ పి.డి. అకౌంట్ ద్వారా చెల్లించుటకు రాష్ట్ర ప్రభుత్వం
వారు చర్యలు తీసుకుంటున్నారు.
5. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేరు ఏమి చెయ్యాలి?
జ. సమాచారం పంపే నాటికి ఆ పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు ఉంటే వివరాలన్నీ పంపాలి. ఇంచార్టీ ప్రధానోపాధ్యాయులు ఉండేటప్పుడు కూడా వివరాలన్నీ పంపాలి. ఇద్దరిలో ఎవరు లేకపోయినా రిమార్క్ లో రాసి పంపాలి.
6. టీచర్స్ లేని స్కూల్స్ యొక్క వివరాలు ఎలా పంపాలి?
జ. రిమార్క్ లో టీచర్ లెస్ స్కూల్ అని రాసి పంపాలి.
7. వర్క్ ఎడ్జెస్టుమెంట్ పద్ధతిలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులుగా ఉంటే వివరాలు పంపాలా?
జ. పంపాలి. కానీ రిమార్క్ లో ఆ సంబంధిత ఉపాధ్యాయులు వర్క్ ఎడ్జెస్టుమెంట్ పద్ధతిలో ఉన్నట్లు రాయాలి.
8. ఎం.ఆర్.సి వివరాలు పంపేటప్పుడు ఆర్గనైజేషన్ కోడ్ వివరాలు ఏమి నింపాలి?
జ. ఎం.పి.డి.ఓ ఆఫీస్ లో ట్రెజరీ ఐ.డి.లో వున్నకోడ్ నింపాలి.
9. మున్సిపల్ పాఠశాలల్లో అన్నింటికీ డి.డి.ఓ కోడ్ ఒక టే ఉంటుంది ఏమి చేయాలి?
జ. డి.డి.ఓ కోడ్ దగ్గర అన్ని పాఠశాలలకు ఒకే కోడ్ వేస్తూ, ప్రధానోపాధ్యాయుల సి.ఎఫ్.ఎం.ఎస్. నెంబర్ వేసి రిమార్క్ లో నింపి పంపాలి.
10. మున్సిపల్ పాఠశాలల్లో అన్నింటికీ డి.డి.ఓ కోడ్ ఒకటే ఉండటం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా?
జ. ప్రస్తుతం మున్సిపల్ పాఠశాలలకు సంబంధించిన మీ దగ్గర వున్న సమాచారాన్ని నింపి పంపండి. ఈ విషయం రాష్ట్ర
ప్రభుత్వ కార్యాలయ దృష్టికి తీసుకువెళ్లటం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు.
11. ప్రస్తుతం ఇచ్చిన సమాచారం లో ఏమైనా చిన్న తప్పులు వున్నట్లైతే పి.డి.అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుందా?
జ. అవును. వివరాలు తప్పుగా ఉంటే పి.డి.అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు రిజెక్ట్ చేయబడుతుంది, ఐ.డి. జెనరేట్ కాదు. అందువలనే సరైన సమాచారాన్ని పంపగలరు.