ఏపి పి.ఆర్.సి 2022 ప్రకారం 442 పేజీల సర్క్యులర్ మెమోతో డిపార్ట్మెంట్స్ వారీగా, కేడర్స్ వారీగా పే స్కేల్స్ విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ.
జనవరి-2022లో ప్రకటించిన 11వ పీఆర్సీకి సంబంధించి పేస్కేళ్లను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగుల క్యాడర్ వారీగా స్కేళ్లు నిర్ణయించింది. 11వ పీఆర్సీ సమ యంలో ఉద్యోగులు తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బలవంతంగానైనా 11వ పీఆర్సీలోని ఫిట్మెంట్, ఇతర నిబంధనలు అమలు చేయాలన్న హడావుడిలో ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త స్కేలు ప్రకారం వేతనాలు ఖాతాల్లో వేసింది. ఇప్పుడు దాదాపు సంవత్సరం తర్వాత క్యాడర్ వారీగా స్కేళ్లు నిర్ణయించింది. దీని ప్రకారం.. కొంతమంది ఉద్యోగులకు వేతనాల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని ఉద్యోగులు చెప్తున్నారు. 11వ పీఆర్సీలో కనీస మూలవేతనాన్ని రూ.20,000 గా నిర్ణయించారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగి మూలవేతనమైనా రూ.20,000 కంటే తక్కువగా ఉండకూడదు. అలాగే, గరిష్ట మూలవేతనాన్ని రూ.1,79,000గా నిర్ణయించారు. ఈ పరిధి దాటకూడదు.
Revision of Pay Scales, 2022 - Department wise Cadre Scales Circular Memo No. 1960939/5/PC-TA/2023, Dated: 13.03.2023.