ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందడమిలా..
![](https://static.wixstatic.com/media/bffb85_42eb2a5b122142c0808b0ad0dd8595b9~mv2.png/v1/fill/w_980,h_980,al_c,q_90,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/bffb85_42eb2a5b122142c0808b0ad0dd8595b9~mv2.png)
• విద్య, ఉద్యోగాలకు పది శాతం రిజర్వేషన్
• మీసేవ, సచివాలయాల్లో దరఖాస్తు స్వీకరణ.
అగ్రవర్ణాల పేదలకు ఉద్యోగాలు, చదువులకు సంబంధించి 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం కల్పించిన నేపథ్యంలో ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) సర్టిఫికెట్లు అవసరం. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కాలపరిమితి ఏడాది మా త్రమే. అగ్రవర్ణాలలోని పేదలు సరియైన సమయం లో వీటిని పొందడం ద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
• అర్హతలు ఇవే..
అగ్రవర్ణాల కుటుంబ ఆదాయం రూ.8లక్షలలోపు, వ్యవసాయ భూమి 5 ఎకరాల లోపు ఉండాలి. వెయ్యి చదరపు అడుగుల స్థలంలో ఇల్లు, మున్సిపాలిటీ ప్రాంతంలో 100 చదరపు గజాల స్థలం ఉండాలి. అదే రూరల్ ఏరియాలో 200 చదరపు గజాల స్థలం మాత్రమే ఉండాలి.
• దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఆధార్కార్డును న్యాయవాది వద్దకు తీసుకువెళ్లి ఈడబ్ల్యూఎస్ దరఖాస్తు చేయడానికి నోటరీ చేసిన అఫిడవిట్ కావాలని కోరాలి. ఈ ఒరిజినల్ నోటరీతోపాటు దరఖాస్తుదారుడి ఆధార్ కాపీ, పాస్పోర్టు సైజు ఫొటో తీసుకుని మీ సేవ, సచివాలయాలకు వెళ్లాలి. అక్కడ వారు ఇచ్చే దరఖాస్తును పూరించి సంతకం చేయాలి. విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న కుటుంబంలోని వారంతా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
• ప్రయోజనాలు
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలల్లో 10శాతం సీట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యా లయాలలో ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు. అలాగే రాష్ట్ర పరిధిలోనూ ఈ 10 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.