💥స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ కు సంబంధించి ఏ ఏ వివరాలను యాప్ నందు అప్లోడ్ చెయ్యాలో పై ఫార్మాట్ నందు చూపబడినవి.
💥User Name: COMP2813×××××××
(చివరి 7అంకెలు మీ మండల మరియు స్కూల్ కోడ్)
Pass word: demo
💥యాప్ నందు మనకు మొత్తం 8అంశాలు కలవు.
1.Attendance on school complex meeting:
ఇందులో "Attended" దగ్గర మీ క్లస్టర్ పరోధిలో మొత్తం ఎన్ని ప్రాథమిక పాఠశాలలు, ఎన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు ఎన్ని ఉన్నత పాఠశాలలు మీటింగ్ కు హాజరు అయ్యారో ఎంటర్ చెయ్యాలి.
హాజరైన పాఠశాలల నుంచి ఎంత మంది ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు హాజరు అయ్యారో నమోదు చెయ్యాలి.
Note: ఇక్కడ "Not Attended" నందు కనిపించే అంకెలను గురించి ఆలోచించనవసరం లేదు.
మీటింగ్ కు ఎంత మంది వచ్చారో అది మాత్రం కరెక్ట్ గా Attended నందు ఎంటర్ చెయ్యాలి.
2. photo
హాజరుకు సంబంధించి ఒక ఫోటోను ఖచ్చితంగా అప్లోడ్ చెయ్యాలి.
3.Overall Performance of the Member Schools:
ఇందులో ఖచిజితంగా మీ క్లస్టర్ పరిధిలోని ఒక పాఠశాలకు సంబంధించిన ఫార్మాట్ లోని వివరాలను ఎంటర్ చెయ్యాలి. (మీకు వీలుఅయితే అన్ని పాఠశాలల వివరాలను ఎంటర్ చెయ్యవచ్చు)
4.Model Class Presentation:
ఇందులో ఖచ్చితంగా ఒక మోడల్ లెసన్ వివరాలను (ఫార్మాట్ లో ఉన్న వివరాలు) ఫొటోతో సహా అప్లోడ్ చెయ్యాలి.
5.Book Review:
ఇందులో కూడా ఖచ్చితంగా ఫార్మాట్ లో ఉన్న వివరాలను ఫొటోతో సహా అప్లోడ్ చెయ్యాలి.
6.Physical Education Awareness:
ఇందులో వ్యాయమ ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి టాపిక్ వివరాలను అప్లోడ్ చెయ్యాలి.
7.TLM/ Project work Presentation:
ఇందులో మీటింగ్ నందు TLM లేదా project work చేసిన ఉపాధ్యాయుని వివరాలను అప్లోడ్ చెయ్యాలి.
8.NGO/ Guest session/Other expert Presentation:
చివరగా ఇందులో ఎవరైనా NGO కానీ లేదా Guest or subject experts కానీ వచ్చిఉంటే ఫార్మాట్ లో ఉన్న వారి వివరాలను అప్లోడ్ చెయ్యాలి.
💥గమనిక:
6, 7 మరియు 8 అంశాలు Optional అని ఉంటుంది. కనుక మీరు ఈ మూడు అంశాలు ఖచ్చితంగా అప్లోడ్ చెయ్యాలి అని ఏమి లేదు.
కానీ 1-5 అంశాలు ఖచ్చితంగా అప్లోడ్ చెయ్యాలి.
చివరగా మనము ఎంటర్ చేసిన వివరాలను ఒకసారి చూసుకొని SUBMIT చేయవలెను.
top of page
Search
bottom of page