రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏల కోత
కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
GO MS No.95 Dated 06.11.2020
Dearness Allowance payable to State Government employees and Dearness Relief to Government Pensioners/Family Pensioners, due from 1st January 2020 shall not be paid. The additional
instalments of Dearness Allowance and Dearness Relief due from 1st July 2020 and 1st January 2021 shall also not be paid.
మూడు డీఏల వివరణ
★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సంక్షోభం కారణంగా మూడు డీఏలు కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
★ కేంద్రం ఇప్పటికే మూడు డీఏలు ఫ్రీజ్ చేస్తూ నిర్ణయించిన బాటలోనే రాష్ట్రమూ తాజా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2020 జనవరి.
★ 2020 జనవరి, జులై ఒకటో తేదీల నుంచి ఇవ్వాల్సిన రెండు డీఏలతోపాటు 2021 జనవరి ఒకటి నుంచి ఇవ్వాల్సిన మరో డీఏ కూడా ఇవ్వబోమన్నారు.
★ తిరిగి 2021 జులై నుంచి కొత్త డీఏలు ఇస్తామన్నారు. ప్రస్తుతం నిలిపేసిన మూడు డీఏలను అప్పుడే పునరుద్ధరిస్తామన్నారు.
అయితే వీటి బకాయిలను ఇవ్వలేమన్నారు.
★ అదే సమయంలో 2021 జులై 1నాటి కరవు పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నుంచి ఎంత కరవు భత్యం వర్తిస్తుందో ఆ మేరకే కొత్త డీఏల అమలు ఉంటుందని స్పష్టంచేశారు.
★ ఉద్యోగులకు 2018 జులై 1 నుంచి 3.144% మేర ఇటీవల మంజూరు చేసిన డీఏ యథాతథంగా అమలు కానుంది.
★ ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఆదేశాలు ఇచ్చారు.
★ కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
★ ఇప్పటికే ప్రకటించిన 3 DA లు అనగా జులై 2018, జనవరి 2019, జులై 2019 కి ఇబ్బంది ఉండదు.