సర్వీసు పెన్షనర్లు, ప్యామలీ పెన్షనర్లు అందరు కొన్ని విషయాలను ఓసారి గమనించి తగు శ్రద్ధ వహించ వలసినదిగా సలహా ఇవ్వనైనది.
1.సర్వీసు పెన్షనర్స్ అందరు మీ PPO కాపీని ఒక పుస్తక రూపంలో (file లో) భద్రపరుచుకోవాలి.
2. అందరు సర్వీసు పెన్షనర్లు తమ PPO copy లో క్రింది విషయాలను పరిశీలించుకోగలరు.
1. సర్వీసు పెన్షనరుగా మన పేరు, పుట్టిన తేదీ సరిగా ఉందా? లేదా పరిశీలించండి.
2) మన PPO లో Spouse / Family Pensioner పేరు కరెక్టుగా ముద్రించబడిందా? లేదా?
3) PPO లో Spouse / Family Pensioner Date of birth Note చేయబడి ఉందా? అది కరెక్ట్ గా ఉందా? లేదా?
ఈ అంశాలు కరెక్టు గా ఉంటే సంతోషం.
కరెక్టు గా లేకపోతే ఏమౌతుందిలే అనే ధోరణి వద్దు. వాటిని సరి చేయించు కోవలసిందే. లేనిచో మన తదనంతరం వారికి ప్యామలీ పెన్షన్ రావడంలో గాని, AQP మంజూరు విషయంలో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది.
ఉదాహరణకు ఇటీవల ఓ సర్వీసు పెన్షనర్ మరణించారు. వారివారసులు STO గారిని కలసి ప్యామలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. STO లో PPO copy చూడగా సామ్రాజ్యం అని పేరుంది. ఆధార్ లో, ఆస్తులలో, బ్యాంక్ ఖాతాలో వారి పేరు సాంబమ్మ గా ఉంది. కావునా చెల్లదని PPO లో పేరు మార్పు కోరుతూ AG Office కు దరఖాస్తు చేసుకోవసలిందిగా సూచించారు.
మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివి సరిచేయించుకోవడం ఉత్తమం. సులుభం కూడా!!
Spouse / Family Pensioner పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో సరి చేయించుకోవాలి.
Date of Birth విషయం లో Spouse / Family Pensioner యెక్క Date of Birth పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో 2005 కు పూర్వం Spouse పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేది వేయక పోవడం లేదా సుమారుగా వయస్సు వేయడం చేసేవారు. అందువల్ల PPO లో పుట్టిన తేది చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం ఉంది. Date of Birth నోట్ కాకపోయినా , తేడా పడినా సంబంధిత దృవపత్రాలు అనగా స్టడీ సర్టిఫికెట్ , ఆధార్ , పాన్ , వైద్యుడు దృవీకరించిన వయస్సు దృవపత్రం జతచేసి PPO నకలు జతచేసి సంబంధిత STO / APPO గారిని కోరితే నమోదు చేస్తారు. ఇవి సర్వీసు పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవాలి.
గమనిక: మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపుసమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేది తరువాత మార్పు చేయాలనుకుంటే చెల్లదు. అలా మార్పు చేసి AQP పొందిన చాలామంది FP లు రికవరీలు చెల్లించిన సందర్భాలున్నాయి. కావునా ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి.
ఇంకా మన PPO లో Service Pension (SP) , Enhanced Family Pension (EFP) , Family Pension అనే మూడు అంశాలు , వాటి ఎదురుగా వచ్చు మొత్తం నోట్ చేయబడి ఉంటుంది. అవికూడా గమనించండి!!
వాటిగురించి చూద్దాం:
1.Service Pension (SP), ఇది మన Length of service , Basic Pay ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీసు పెన్షనర్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హతకల అలవెన్సులు చెల్లింపబడతాయి. PRC అమలైనపపుడు మన Service Pension (SP) రివైజ్ అవుతుంది.
2. సర్వీసు పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది Family Pension. దీనిపై DR చెల్లింపబడతుంది. సర్వీసు పెన్షనర్స్ లానే వీరికి కూడా PRC లలో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడుతుంది. Family Pensioner కు కూడా వారి వయస్సు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది.