Leave Travel Concession (LTC) Rules.
ఎల్‌టీసీతో హ్యాపీ జర్నీ.
LTC to Employees and Teachers working in ULB'S- Permission Requested- certain
instructions issued.
ఇలాంటి ప్రయాణాకి అయ్యే ఖర్చుల్లో 80 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
🌇ఇందుకోసం ప్రభుత్య ఉద్యోగులు చేయాల్సిందల్లా ఎల్టీసీ లో చేరడమే. అసలు ఏంటి ఇది, ఇందులో బిల్లులు ఎలా క్లైయిమ్ చేయాలి, ఎప్పటిలోగా చేయాలి అనే దానిపై ప్రత్యేక కథనం... !
🌇ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెల్ కన్షేషన్. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై కుటుంబంతో సహా తాను పని చేస్తున్న ఉద్యోగ ప్రాంతం నుండి స్వస్థలానికి, రాష్ట్రంలోని ఏదైనా ఇతర ప్రదేశానికి వెళ్లి రావచ్చు. ప్రయాణ ఖర్చుల్లో 80 శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది.
🌇నిబంధనలు ఇవి
🌇రాష్ట్రంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వచ్చే బ్లాక్ పిరియడ్‌లో మొదటి రెండేళ్లలో ఒకసారి స్వస్థలానికి, చివరి రెండేళ్లలో రాష్ట్రంలోని ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్లి రావచ్చు. సర్వీస్ మొత్తంలో ఒకసారి కుటుంబంతో కలసి దేశంలోని ఏ ప్రదేశానికైనా విహార యాత్రకు వెళ్లి రావచ్చు.
🌇బ్లాక్ పిరియడ్ అంటే
ఒకసారి ఎల్టీసీ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఏడాది అనంతరం నుంచి బ్లాక్ పిరియడ్ ప్రారంభమవుతుంది. నాలుగేళ్లను ఒక బ్లాక్ పిరియడ్‌గా పరిగణిస్తారు. మొదటి రెండేళ్లలో స్వస్థలం వెళ్లి రావడానికి, తరువాత రెండేళ్లలో రాష్ట్రంలోని ఏదైనా ప్రదేశానికి వెళ్లి రావడానికి అనుమతి ఉంటుంది. మొదటి రెండేళ్లలో స్వస్థలానికి వెళ్లని వారు, చివరి రెండేళ్ల కాలంలో రెండు సార్లు రాష్ట్ర పర్యటనకు వెళ్లి రావచ్చు.
🌇ఎటువంటి సెలవులు వాడుకోవాలంటే..
🌇క్యాజువల్ లీవ్ లేదా అర్హత ఉన్న ఏ ఇతర సెలవునైనా ఇందుకు వాడుకోవచ్చు. ప్రభుత్వ సెలవు రోజులను కలిపి, కలపకుండా కూడా వినియోగించుకోవచ్చు. సెలవు విషయంలో సంబంధిత అధికారితో ముందస్తు అనుమతి తీసుకోవాలి. వెకేషన డిపార్ట్మెంట్ (ఉదాహరణ- ఉపాధ్యాయులు) దసరా, సంక్రాంతి, వేసవి సెలవులు ఇందుకు వినియోగించుకోవచ్చు. మిగతా ఉద్యోగులు మాత్రం ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
80 శాతం అడ్వాన్సు....
ఎల్టీసీపై వెళ్లి వచ్చేందుకు అంచనా వేసిన ఖర్చులో 80 శాతం వరకు అడ్వాన్స రూపంలో తీసుకోవచ్చు. మిగిలినది ప్రయాణం పూర్తయిన తరువాత ఫైనల్ బిల్ సమర్పిస్తే చెల్లిస్తారు.
🚉 దేశంలో ఏ ప్రదేశానికైనా వెళ్లే సందర్భంలో 3,500 కిలో మీటర్లకు అవకాశం ఉంటుంది. క్లైమ్ మొత్తం గరిష్టంగా రూ.18,750 వరకు చెల్లింపుకు అనుమతి ఇస్తారు.
🚎స్వస్థలానికి వెళ్లే సమయంలో, రాష్ట్రంలో ఇతర ప్రదేశానికి వెళ్లే సమయంలో మొత్తం దూరానికి అయిన మొత్తం చెల్లిస్తారు. రాష్ట్రం దాటితే సరిహద్దు వరకు ఉన్న టిక్కెట్ ధరను మాత్రమే చెల్లిస్తారు. రైల్ రూట్ ఉంటే దాని ప్రకారమే చెల్లింపు ఉంటుంది.
🌇 ఎల్టీసీ మొత్తం క్లెయిమ్ చేసే సమయంలో టీఏ బిల్లుకు, బస్, రైల్ టికెట్లు, క్యాష్ రశీదు, సొంత డిక్లరేషన్ జత చేయాలి. తిరుగు ప్రయాణం పూర్తయిన తరువాత నెలలోపు డ్రాయింగ్ అధికారి ద్వారా ట్రెజరీకి బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. 30 రోజులు దాటితే ట్రెజరీ వారు 15 శాతం కోత విధిస్తారు.