ఏ.పీ. స్టేట్ & సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996
➖రూలు 33ఎ, రూలు33బి మరియు రూలు:36-1 పై వివరణ
సీనియారిటీ:
ఒక ఉద్యోగి సీనియారిటీ అతడు ఉద్యోగములో చేరిన తేదీ నుండి లెక్కించబడుతుంది. *(రూలు 33ఎ)* అయితే నియామకముల నిమిత్తము నియామకాధికారి అభ్యర్థుల జాబితా తయారు చేసి వున్నచో సదరు జాబితాలోని క్రమము ప్రాతిపదికగా అతని సీనియారిటీ నిర్ణయించబడుతుంది. *(రూలు 33బి)*
*రూలు36-1వ* నిబంధన మేరకు ఎ.పి.పి.సర్వీసు కమీషన్ లేదా డి.ఎస్.సి, లేదా మరొక రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ప్రత్యక్ష నియామకము జరిగే అభ్యర్థుల ర్యాంకు మరియు రోస్టర్ పద్ధతిని అనుసరించి సీనియారిటీ నిర్ణయించడం జరుగుతుంది.