వెకేషన్ డిపార్టుమెంటు లలో పని చేసే వారికి ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా 3 రోజులు జమ చేయబడతాయి.
తాత్కాలిక ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 8 రోజులు జమ చేయబడతాయి.
శాశ్వత ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 15 రోజులు జమ చేయబడతాయి.
ఈ లీవ్ జమ చేయడానికి రోజులు ఉన్న నెలల్ని వదలి పెట్టి పూర్తీ గా సర్వీస్ చేసిన నెలలను పరిగణన లోకి తీసుకుంటారు.
ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో చేరినట్లయితే మొదటి రెండు నెలలకు ఒక్కొక్క రోజు, ప్రతీ మూడవ నెలకు రెండు రోజులు జమ చేస్తారు, ఉదాహరణకు ఒక ఉద్యోగి ఫిబ్రవరి 12 వ తేదీన తాత్కాలిక ప్రాతిపదికన చేరితే
ఫిబ్రవరి కి "0"
మార్చి కి ఒక రోజు
ఏప్రిల్ కి ఒక రోజు
మే కి రెండు రోజులు
జూన్ కి ఒక రోజు చొప్పున మొత్తం ఐదు రోజులు అడ్వాన్సుగా జమ చేస్తారు
ఎవరైనా ఉద్యోగి కొంత కాలం జీత నష్టపు సెలవు (EOL) లో ఉన్నట్లయితే తదుపరి అర్ధ సంవత్సరానికి ఎంతకాలం EOL లో ఉంటె అందులో పదో వంతు EL తగ్గించాలి (గరిష్టంగా శాశ్వత ఉద్యోగులకు 15, తాత్కాలిక ఉద్యోగులకు 8 రోజులు తగ్గించాలి)
ఉదాహరణకు ఒక ఉద్యోగి జూలై నుండి డిసెంబర్ మధ్యలో 67 రోజులు EOL లో ఉన్నట్లయితే తదుపరి జనవరి నెలలో జమ చేసే 15 రోజులలో 7 రోజులు తగ్గించి 8 రోజులు జమ చేయాలి.
గరిష్టంగా నిల్వ ఉండే సంపాదిత సెలవు ౩00 రోజులు (16.09.2005 నుండి)
01.06.1964 నుండి 30.06.1983 గరిష్ట నిల్వ పరిధి 180 రోజులు
01.07.1983 నుండి 15.09.2005 మధ్యలో గరిష్ట నిల్వ పరిధి 240 రోజులు
వైద్య కారణాలపై లేదా వ్యక్తిగత కారణాలతో ఒకేసారి గరిష్టంగా ఆరు నెలలు దాటకుండా ఉపయోగించుకోవచ్చు. (నాల్గవ తరగతి ఉద్యోగులు అయితే 120 రోజులు)
CL మినహా ఇతర లీవులతో కలిపి ఉపయోగించుకోవచ్చు.
పబ్లిక్ హాలిడే, ఆప్షనల్ హాలిడే, CCL లని సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ గా ఉపయోగించుకోవచ్చు.
ఆరు నెలల వరకు అన్ని రకాల అలవెన్సులు తో పూర్తి జీతం పొందవచ్చు. ఆరు నెలల తరువాత HRA, CCA చెల్లించారు.
నిల్వ ఉన్నా సంపాదిత సెలవు ని సరెండర్ చేసుకుని దానికి సమానమైన నగదు పొందవచ్చు.
15 రోజులు సరెండర్ చేసుకోవడానికి 12 నెలల విరామం, 30 రోజులు సరెండర్ చేసుకోవడానికి 24 నెలల విరామం అవసరం.
సంపాదిత సెలవు నిల్వ కనుక 285 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 12 నెలల గ్యాప్ లేకపోయినా 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకేసారి ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.
తాత్కాలిక ఉద్యోగులు కూడా 24 నెలల విరామం తరువాత 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
మంజూరు ఉత్తర్వులు మంజూరు చేసిన తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.
పదవీ విరమణ పొందినపుడు లేదా సర్వీస్ లో ఉండగా చనిపోయినా ఉద్యోగి సంపాదిత ఖాతాలో ఉన్న నిల్వలు సమానమైన మొత్తాన్ని నగదు గా చెల్లిస్తారు (గరిష్టంగా ౩00 రోజులు)
ప్రభుత్వ క్వార్టర్ల లో ఉండేవారికి HRA చెల్లించవచ్చు.
కన్వేయన్స్ అలవెన్సు, IR లు చెల్లించబడవు.
తాత్కాలిక ఉద్యోగులుగా చేరిన వారి సర్వీస్ రెగ్యులరైజ్ అయ్యాక లీవులను రీకాస్ట్ చెయ్యాలి
top of page
Search
bottom of page