ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం :: విజయవాడ
ఆర్ . సి . నెం . 36 / 3-1 / 2021 తేదీ : 23-08-2021
పత్రికా ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు 06-08-2021 తేదీన విడుదల చేయడం జరిగినది . 2020-21 విద్యా సంవత్సరం నందు పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులు వారి ఉన్నత చదువుల కొరకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళు వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ ను ఈ సంవత్సరం నుండి ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనుటకు అవకాశం కల్పించడమైనది . దీనికై ఫీజు .80 / - ఆన్లైన్ ద్వారా చెల్లించవలెను . అదే విధంగా 2004 నుండి 2020 విద్యా సంవత్సరాలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ కావలసిన యెడల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనవలను , 24-08-2021 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించబడును . www.bse.ap.gov.in వెబ్సైట్ నందు గల విధి విధానములను అనుసరించి ఆన్లైన్ లో ఈ సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారు శ్రీ ఎ సుబ్బారెడ్డి గారు తెలియజేశారు .
సం . - ఎ . సుబ్బా రెడ్డి సంచాలకులు ప్రభుత్వ పరీక్షలు ఉధృవీకరించడమైనది // B.State 23/8/2021 ఉప కమీషనర్