బిసి గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు (2020-21)
★ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
★ ప్రస్తుతం పదో తరగతి చదువుతూ మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు.
★ వీరు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
★ ప్రవేశం పొందే విద్యార్థి కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష లోపు ఆదాయం ఉండాలి. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
★ విద్యార్థులు పూర్తి వివరాలకు www. jnanabhumi. ap. gov. in చూడాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు.