top of page

విద్యా శాఖ కమిషనర్ తో బదిలీలు, RATIONALISATION విషయాల గురించి FAPTO చర్చలు


ఈ రోజు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తో FAPTO రాష్ట్ర కమిటీ జరిపిన చర్చలకు సంబందించిన ముఖ్య అంశాలు:


1. 29-02-2020 నాటి రోలు లేదా అక్టోబర్ 31 నాటికి గల రోలు - వీటిలో ఏది ఎక్కువ అయితే ఆ రోలు ప్రకారం రేషనలైజేషన్ జరుపుతారు.


2. ప్రవేటు పాఠశాలల నుండి చేరిన విద్యార్థులకు సంబందించి తల్లిదండ్రులు నుండి తీసుకున్న డిక్లరేషన్ పై hm countersign తో MEO కి సమర్పిస్తే వాటిని చైల్డ్ ఇన్ఫో లో చేరుస్తారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తారు.


ఈ ప్రక్రియ కొరకు బదిలీల షెడ్యూల్ 10 రోజులు వాయిదా వేస్తామని చెప్పారు.


3. వెబ్ కౌన్సెలింగ్ ముందుగా డెమో ప్రదర్శిస్తారు. దానిలో లోపాలు ఉంటే సరిచేస్తారు.


4. ఏజన్సీ ప్రాంతాలలో HILL TOP ఏరియా ను కేటగిరీ 4 గా పరిగణిస్తారు.


5. బదిలీలకు గరిష్ట పరిమితి హెచ్ ఎమ్ లకు 5 సంవత్సరాలు, మిగిలిన కెడర్లకు 8 అకడమిక్ సంవత్సరాలు.


6. HM బదిలీల తర్వాత HM పదోన్నతులు, తరువాత స్కూల్ అసిస్టెంట్ కేడర్ బదిలీలు, ప్రమోషన్స్, తర్వాత SGT, పండిట్, పి యి టి బదిలీలు జరుగుతాయి.

అయితే ప్రస్తుతం ఆప్షన్ ఇచ్చిన వారికే ప్రమోషన్స్ జరుపుతారు.


మిగిలిన అంశాలు సెక్రటరీ గారితో చర్చిస్తారు


⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️




apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page