అమ్మఒడి పథకం మండల విద్యాశాఖాధికారులకు మరియు వివిధ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ సూచన, అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించిన జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 1 వరకు స్వీకరిస్తారు. --------------------------------------- కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల పేర్లు కనబడుట లేదని చెబుతునారు అటువంటి పేర్లను మీకు పంపించిన excel షీటు లో పొందుపరచి కంప్లయింట్ కోలమ్ లో వీవరాలు పూర్తిగా వ్రాసి మీ సోతకం మరియు స్టాంప్ వేసి గ్రీవియన్స్ కౌంటర్ లో ఎమ్ ఇ ఓ లకు సమర్పించండి. ---------------------------------------- అమ్మ ఒడి - షరతులు...
• అమ్మవడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే • ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో), చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది. • మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / స౦రక్షకుల ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరి చూసుకోవలెను. • ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు ఇవ్వాలి.
ఈ క్రింది కారణాలతో అమ్మవడి వర్తించదు:
1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే... 2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే... 3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా... 4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే... 5. 4చక్రాల వాహనం ఉంటే.. 6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే... 7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే.. 8. గ్రామంలో నివాసం లేకుంటే... 9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే... 10. మరణించి ఉంటే... 11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే...
పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.
ఈ క్రింద ఇవ్వబడిన ఫార్మాట్ ను మీ మండలం లోని అన్ని గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు (WEA) మరియు వాలంటీర్లకు అంద చేయవలెను. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వర్తింప చేయుటకు మరియు ఇచ్చిన సమాచారంలో సవరణల కొరకు దిగువ ఫార్మేట్ లో నమోదు చేసే సమయంలో ఫార్మేట్ మొత్తం క్షుణ్ణంగా చదివి అందులో ఉన్న అన్ని పరిశీలించి నమోదు చేయాలి. అలాగే సంబంధిత ఫార్మేట్ కు సంబంధించి తగిన ఆధారాలు Xerox కాపీలను వాటికి అటాచ్ చేయాలి. సంబంధిత ఫార్మేట్ మీద వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) యొక్క సంతకం ఉండాలి. ఈ విధంగా రెడీ అయిన సంబంధిత ఫార్మేట్ లు గ్రామ సచివాలయం నుండి ఎం.ఈ.ఓ(MEO) ఆఫీస్ కి అందచేయవలెను..
Click here to download formats 👇
అమ్మవడి దరఖాస్తు⬇️
https://drive.google.com/file/d/1CAGdFONxOGV86qD7YlTjmSfHihHzvhcN/view?usp=drivesdk
అమ్మవడి అర్హుల వివరముల సవర్ణ దరఖాస్తు⬇️
https://drive.google.com/file/d/1CAReewhly6_m2EDyPjrVLKGP8gA03ePK/view?usp=drivesdk
Click here to download Greviances proforma.⬇️
https://drive.google.com/file/d/1CGwousVE4A2piIo3nDxv50dKL2Mwxqs4/view?usp=drivesdk