🌷జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ :: మార్గదర్శకాలు🌷
❖ కార్యకమ ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రులు/MLA/MLCలు ,జిల్లా స్థాయి అధికారులు/ఇతర అధికారులు మరియు తల్లిదండ్రుల కమిటీ సభ్యులను ఆహ్వానించాలి.
❖ విద్యార్థి తల్లికి మాత్రమే JVK కిట్లు ఇవ్వాలి.
❖ రోజుకు 50మంది తల్లులు& 50మంది విద్యార్థులను మాత్రమే పిలవాలి.
❖ పంపిణీలో తల్లి బయోమెట్రిక్ అథెంటిఫికేషన్(మొబైల్ అప్లికేషన్ ఆధారిత) వేయడం ద్వారా అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
❖ తగిన జాగ్రత్తలను పాటించాలి. సౌకర్యాలను కల్పించాలి.
❖ కార్యక్రమానికి ఆహ్వానించబడ్జ తల్లిదండ్రులు (విద్యార్థులను కూడా) శానిటైజ్ చేయించుకొనేలా చూడాలి. ఇందుకు అగు ఖర్చును పాఠశాల వార్షిక ( కాంపోజిట్ గ్రాంటు) గ్రాంటు నుండి వినియోగించాలి.
❖ కేంద్ర ప్రభుత్వ కోవిడ్-19 ప్రోటోకాల్ మార్గదర్శకాలను తప్పక అనుసరించాలి.
❖ కార్యక్రమానికి హాజరగు వారు తప్పక మాస్క్ ను ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి.
జగనన్న విద్యాకానుక అప్లికేషన్ ::లాగిన్ విధానం. ★ యూజర్ నేమ్ ::- యూడైస్ కోడ్ ★ పాస్వర్డ్ ::- చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ద్వారా అప్లికేషన్ నందు లాగిన్ కావాలి. ★ పాస్వర్డ్ మరచిపోతే.. కింది లింక్ ను తాకి... ★ యూజర్ ఐడీ ::- యూడైస్ కోడ్ ★ హెచ్.ఎం మొబైల్ నెంబర్ :: ఇవ్వబడ్డ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి GET OTP లింక్ ను తాకాలి. ★ రిజిష్టర్ కాబడ్డ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి.
★ click here ⬇️
జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు.
1.ఈ యాప్ ఈ రోజు 12 గంటల నుంచి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంచ బడును.
2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్ డివైస్ వేరువేరుగా ఇవ్వబడును.
3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును.
4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు .
5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను.
6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను.
7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే ఉపయోగించ వలెను.
8. ఈరోజు అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును.
9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ వచ్చును. కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము.
10. ముఖ్యముగా ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో చేత గాని ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుందో ఆ పాఠశాలలో ముందుగా శానిటైజ్ చేసుకోవలెను.
11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు.
గమనిక : జగనన్న విద్యాకానుక
2019-20 రోలు ప్రకారం జగనన్న విద్యాకానుక (JVK ) కిట్ (BAG, BELT, UNIFORM, SHOE, SOCKS) పంపిణీ చేసి విద్యార్థి తల్లి లేదా గార్డియన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిస్ తీసుకోవాలి.
2020-21 రోలు ప్రకారం పాఠ్యపుస్తకాలు పంపిణి చేసి మరల విద్యార్థి తల్లి లేదా గార్డియన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఐరిష్ తీసుకోవాలి.
జగనన్న విద్యా కానుక app - అవగాహన కొరకు
జగనన్న విద్యా కానుక app లో user name దగ్గర మన పాఠశాల డైస్ కోడ్ ఇచ్చి, password దగ్గర student info(child info) Admin@1234 ఇచ్చి >> పైన క్లిక్ చేస్తే menu open అవుతుంది.
ఇక్కడ JVK పైన క్లిక్ చేస్తే CLASS 1 CLASS 2 CLASS 3 CLASS 4 CLASS 5 లు ఉంటాయి. మనం ఇవ్వదలచిన CLASS పైన క్లిక్ చేస్తే ఆ తరగతి లో ఉన్న పిల్లల వివరాలు విడివిడిగా OPEN అవుతాయి. ఏ విద్యార్థి పేరునైతే మనం Select చేసుకుంటామో ఆ విద్యార్థి పేరు పైన క్లిక్ చేస్తే విద్యార్థి పెరు, తల్లి పేరు, మొబైల్ నంబర్ మరియు తల్లి ఆధార్ లోని చివరి 4 అంకెలు కన్పిస్తుంది. దీనితోబాటు ఈ వివరాలు క్రింద BAG ◽ BELT ◽ UNIFORM ◽ SHOES ◽ SOCKS ◽ లు కనిపిస్తాయి. మనం ఇచ్చే ప్రతీదానిపైన టచ్ చేస్తే ఆ బాక్స్ లో ☑️ మార్కు పడుతుంది. దీని కిందుగా కుడిచేతి ప్రక్కన IRIS BIOMETRIC అని కనిపిస్తాయి. ప్రాథమిక/ప్రాథమికోన్నత పాఠశాలల్లో అయితే IRIS device ఉంటుంది కాబట్టి IRIS పైన క్లిక్ చేస్తే తల్లి IRIS తీసుకుంటే SUCCES అని చూపిస్తుంది. తరువాత మళ్ళీ మరొక విద్యార్థికి ఇలానే చేస్తే సరి.
Click here to download Guidelines ⬇️
జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణి- అప్లికేషన్-విద్యార్థి డేటా సబ్మిట్ చేయు విధానం ❖ కిట్ ను పంపిణీ చేయునపుడు ఒక విద్యార్థి ని అప్లికేషన్ లో ఎంచుకొన్న తరువాత కింది వివరాలు అప్లికేషన్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ➠ తరగతి ::- ➠ తల్లి / సంరక్షకుల మొబైల్ నెంబర్::- ➠ తల్లి / సంరక్షకుల పేరు::- ➠ తల్లి / సంరక్షకుల ఆధార్ నెంబర్ ::- ❖ కిట్ నందు ఉండవలసిన వస్తువులు ➠ బ్యాగ్ ::- ➠ బెల్ట్::- ➠ నోట్ బుక్ ::- ➠ యూనిఫాం::- ➠ షూ::- ➠ సాక్స్::- ❖ పంపిణీ చేయబోవు వస్తువులకు ఎదురుగా ఉన్న బాక్స్ నందు టిక్ మార్క్ ✅ పెట్టి.... ❖ బయోమెట్రిక్ డివైస్ నందు BIOMETRIC ఆప్షన్ ను తాకి తల్లి/సంరక్షకుల యొక్క బొటనవేలు ద్వారా బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ తీసుకోవాలి. ❖ ఐరిస్ డివైస్ నందు కూడా ఈ ప్రక్రియను అనుసరించాలి. ❖ ఒక విద్యార్థి యొక్క డేటా విజయవంతంగా సబ్మిట్ అయిన తరువాత తదుపరి ఎంపిక కొరకు విద్యార్థుల పేర్లు డిస్ ప్లే అవుతాయి.
Jagananna Vidya Kanuka Android App ఉపయోగించి JVK KIT మరియు TEXT BOOKS కు సంభందించి ఏ విధంగా విద్యార్థి Mother యొక్క బయోమెట్రిక్ Authentication తీసుకోవాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి, Mother Aadhar నెంబర్ App లో అప్డేట్ కాకపోతే ఎలా Mother ఆధార్ అప్డేట్ చేయాలో కూడా వివరించడం జరిగింది.