సందేహం--సమాధానం
ఒక టీచర్ తేదీ 1.1.1998 నాడు నియామకం అయ్యారు. 31.12.2017 నాటికి 20 సర్వీస్ పూర్తి అయింది. అయితే, ఈ ఇరవై ఏళ్ళ సర్వీస్లో 3 సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న జీతనష్టపు అసాధారణ సెలవు ఉంది. సదరు టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
జవాబు:
తీసుకోరాదు. 20 ఏళ్ళ నెట్ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. పెన్షన్ రూల్ 43 ప్రకారం ఒక ఉద్యోగి/టీచర్ 20 సర్వీస్ పూర్తిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలచినప్పుడు.... Study కోసం పొందిన జీతనష్టపు అసాధారణ సెలవు (OCL Loss of Pay)ను మాత్రమే క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణిస్తారు. మెడికల్ గ్రౌండ్స్ లేదా ప్రైవేట్ అఫైర్స్ పొందిన OCL LP ని క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణించరు.అయితే... సూపెరాన్యుయేషన్ (58/60 Years) తో రిటైర్ అయినప్పుడు మాత్రం.... మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న Unlimited Period మరియు ప్రైవేట్ అఫైర్స్ తో పొందిన 36 నెలల OCL Loss of Pay ని పెన్షన్ కు క్వాలిఫయింగ్ సర్వీస్ గా లెక్కిస్తారు.
🌷🌷🌷🌷
ప్రశ్న:
ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??
జవాబు:
చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
🌷🌷🌷
ప్రశ్న:
నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??
జవాబు:
జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.
🌷🌷🌷
ప్రశ్న:
మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??
జవాబు:
చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.