ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు గురించి జిల్లా ఖజానా అధికారులకు క్లారిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు
AAS గురించి ట్రెజరీ వారు ఇచ్చిన ఉత్తర్వులు ఇవి
అయితే కొన్ని సమూహాలలో ఈ ఉత్తర్వుల వల్ల అసలు డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కాకపోయినా అప్రయత్న పదోన్నతిని ఇవ్వమని ఈ ఉత్తర్వులలో తెలిపినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
ఇప్పుడు ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో కూడాను గతంలో డిపార్ట్మెంట్ టెస్ట్ లు తర్వాత పాస్ అయినప్పటికీ ఆ రోజుకు అనగా వారి 12 లేక 24 సంవత్సరాల సేవా కాలము పూర్తి అయిన రోజుకి... dept test లు పాస్ కాలేదని .... తరువాత పాసైనప్పటికీ...ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం స్కేల్స్ నిరాకరించారు.
అటువంటి దృష్టాంతాలు ఏవైనా ఉన్నట్లయితే వారు కావలసిన అర్హతలు పొందిన నాటినుండి అనగా డిపార్ట్మెంటల్ టెస్ట్ లు కానీ మిగిలిన అకాడమిక్ అర్హతలు కానీ పొందిన రోజు నుండి వారికి ఏ ఏ ఎస్ ఇవ్వమని అర్థం.
అంతేకానీ డిపార్ట్మెంటల్ టెస్ట్ లు లేదా ఇతర కావలసిన అర్హతలు లేకుండా ఇవ్వమని ఈ ఉత్తర్వులలో చెప్పలేదు దయచేసి గమనించగలరు