top of page

2020-21విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో అడ్మిషన్స్ తీసుకోవటానికి అన్ని పాఠశాలల HMలు పాటించాల్సిన సూచనల

2020-21 విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో అడ్మిషన్స్ తీసుకోవటానికి అన్ని పాఠశాలల HM లు పాటించాల్సిన సూచనలు.


◾ ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ◾ ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియను మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ), ఉప విద్యాశాఖాధికారులు (డీవైఈఓ) పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. ◾ ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు (ఆర్జేడీ) కమిషనర్ సర్క్యులర్లు జారీ చేశారు. ◾ ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అంతా పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రమోషన్ జాబితాలను రూపొందించాలన్నారు.  ◾ తదుపరి తరగతిలో వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు.


◾ ఇక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన విద్యార్థులను యూపీ లేదా హైస్కూళ్లలో చేర్చేందుకు   తల్లిదండ్రుల సమ్మతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ◾ ఆరు, ఎనిమిది తరగతులలో చేరేందుకు విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని, వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు. ◾ వారు ఏ స్కూల్ లో చేరాలను కుంటున్నారో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం)తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలపాలన్నారు. ◾ ప్రక్రియను ప్రాథమిక స్కూళ్లలో ఎంఈఓ, హైస్కూళ్లలో డీవైఈఓ పర్యవేక్షించాలన్నారు. ◾ వలస కూలీల పిల్లలకు ఎలాంటి పత్రాలు లేకున్నా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు. వారి నుంచి ఎలాంటి టీసీలను అడగవద్దన్నారు.  ◾ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ఎంలు టీసీ, స్టడీ సర్టిఫికెట్లను అడగవద్దని స్పష్టం చేశారు. ◾ ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాల యాలలో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ◾ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీలు ఉన్న ఏడు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ కూడా అయిన చినవీరభద్రుడు తెలిపారు. ◾ ఈ నెల 20 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేజీబీవీలలో టెన్త్ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు.


Kommentare


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page