top of page

AP teachers Transfers Schedule released పూర్తివివరాలు.

Updated: Aug 23, 2021


Transfers Tentative Schedule released


కౌన్సెలింగ్‌ షెడ్యూలు


ఏదైనా పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు ఎక్కువగా ఉంటే అక్టోబరు 14న ఉన్న సంఖ్య ఆధారంగా జిల్లా స్థాయి కమిటీ అనుమతితో నిర్ణయిస్తారు. సంబంధిత పాఠశాలలో 18 నవంబరు 2012కు ముందు నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయులు, 18 నవంబరు 2015 నుంచి ఉన్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. ఉపాధ్యాయులకు 8, ప్రధానోపాధ్యాయుడికి 5 అకడమిక్‌ సంవత్సరాలుగా నిర్ణయించారు.


డీఈవో పూల్‌ పోస్టుల తొలగింపు


అక్టోబరు 1 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు అర్హులు.


రెండేళ్లలో పదవీవిరమణ పొందనున్న వారికి ఉండదు. కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.


ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాల నుంచి పోస్టులను అవసరం ఉన్న చోటుకు మారుస్తారు.


విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పోస్టును మార్పు చేస్తారు.


అంధులకు బదిలీల నుంచి మినహాయింపు. కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.


డీఈవో పూల్‌లో ఉన్న ఉపాధ్యాయులను వారు వేతనాలు తీసుకుంటున్న పాఠశాలల్లో ఉన్నట్లు మాత్రమే చూపుతారు. ఇక నుంచి ఆ పూల్‌లో ఉండరు.


వృత్తి విద్య, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌, భాషా పండితులు గ్రేడ్‌-2 తదితర ఉపాధ్యాయులకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది.


ఉన్నతీకరించిన పోస్టులకు అర్హత లేని వ్యాయామ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉన్న పాఠశాలలోనే కొనసాగాలి.


ఏదైనా పాఠశాలను మరొక దానిలో కలిపేసి ఉంటే ఆ తేదీనే సర్వీసుగా తీసుకుంటారు.


పదోన్నతుల వారికి.


హేతుబద్దీకరణ, బదిలీలకు ముందు తాత్కాలిక పదోన్నతులు కల్పించనున్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల వరకు పదోన్నతులిస్తారు. అలా పొందిన వారికి కౌన్సెలింగ్‌లోనే పోస్టింగ్‌లు ఇస్తారు.


షెడ్యూల్‌ ఇలా..(43రోజుల షెడ్యూల్)


తాత్కాలిక పదోన్నతుల కౌన్సెలింగ్‌: అక్టోబరు 19-20


హేతుబద్ధీకరణ ప్రక్రియ: 21 నుంచి 26


మేనేజ్‌మెంట్‌, కేటగిరీ, సబ్జెక్టు, మీడియం వారీగా ఖాళీల ప్రదర్శన: 27, 28


స్వీయ ధ్రువీకరణతో హెచ్‌ఎం, ఉపాధ్యాయుల దరఖాస్తుల స్వీకరణ: 29 అక్టోబరు- 2 నవంబరు


ఆన్‌లైన్‌లో పరిశీలన: నవంబరు 3- 4


ప్రాథమిక సీనియారిటీ జాబితా ప్రదర్శన 5- 9


వెబ్‌సైట్‌లో అభ్యంతరాల స్వీకరణ: 10-12


జేసీల ఆమోదంతో వెబ్‌సైట్‌లో అభ్యంతరాల పరిష్కారం: 13- 15


తుది సీనియారిటీ జాబితా: 16- 18


వెబ్‌ఆప్షన్ల నమోదు: 19-21


తుది కేటాయింపుల ప్రదర్శన: 22- 27


తుది కేటాయింపుల్లో సాంకేతిక సమస్యలు ఉంటే సమీక్ష: 28-29


వెబ్‌సైట్‌లో బదిలీ ఉత్తర్వులు: 30





apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page