top of page

AP లోని ఉపాధ్యాయులు అందరూ 22.06.2020 నుండి ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాలని CSE వారి ఉత్తర్వులు

పాఠశాల విద్య.. UDISE డేటా 2019-20.. చాలా పాఠశాలల్లో డేటా లో వ్యత్యాసం ఉన్న దృష్ట్యా.. 2020-21 UDISE డేటా అప్డేట్ చేయవలసియున్నందున రాష్ట్రంలోని అందరు HM లు, ఉపాధ్యాయులు ది. 22.06.2020 న వారి పాఠశాల విధులకు రిపోర్ట్ చేయవలసింది మరియు పాఠశాలకు హాజరగునప్పుడు పాటించాల్సిన నిబంధనలు పై ప్రొసీడింగ్స్ నందు పొందుపరచబడినవి అంతేకాక HM లు, ఉపాధ్యాయులు హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్లరాదని... పై విషయాలన్నీ అమలగునట్లు చూడవలసిందిగా అందరు RJD లను, DEO లను CSE AP వారు కోరారు(టీచర్స్ కి మాత్రమే పిల్లలకు కాదు).


కమీషనర్ గారి ఉత్తర్వులు 145,dt.22.6.20 ప్రకారం.


🙆11-06-2020 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసినందున.


🙆టీచర్లు అందరూ 22-6-20 నుండి పాఠశాలకు తప్పనిసరిగా హాజరు కావాలి.


🙆పిల్లలను స్కూలుకు పిలవకూడదు.


🙆రోజు బయోమెట్రిక్(with proper sanitization) హాజరు వెయ్యాలి.


🙆పాఠశాల రికార్డులు,Udise,PD Ac etc update చెయ్యాలి.


🙆నాడునేడు పనులు చెయ్యాలి.


🙆అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదు.


🙆కంటోన్మెంట్ జోన్ పరిధిలోని పాఠశాలలకు మినహాయింపు, కాని పైన పేర్కోన్న పనులలో ఉపాధ్యాయులు పాల్గోనాలి.


🙆దీర్ఘకాలిక రోగాలు, గర్భిణీ మహిళలకు మినహాయింపు (సంబంధిత సర్టిఫికెట్ జతచేయాలి).


🙆తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమలు లో ఉంటాయి , ప్రతి రోజు పాఠశాలలకి వెళ్తూ, హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గారు.


🙆Covid-19 రక్షణ చర్యలు తీసుకుంటూ హాజరు కావాలని ఆదేశించారు.


Click here to download proceedings ⬇️


Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page