top of page
Writer's pictureAPTEACHERS

APGLI కి సంబంధించి మీ సబ్ స్క్రిప్షన్ APGLI సైట్ లో నమోదు అవుతున్నదా లేదా అనే విషయం మరియు బాండ్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునే విధానం.

APGLI కి సంబంధించి మీ సబ్ స్క్రిప్షన్ APGLI సైట్ లో నమోదు అవుతున్నదా లేదా అనే విషయం మరియు బాండ్స్ ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకునే విధానం:


మొదటిగా



అనే వెబ్ సైట్ మీ‌ మొబైల్ లేదా డెస్క్ టాప్‌లో ఓపెన్ చెయ్యాలి.


ఆ తరువాత user name వద్ద మీ‌ CFMS ID ని ఎంటర్ చెయ్యాలి.


GO అని బటన్ ప్రెస్ చెయ్యగానే పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.


సాధారణంగా ఫర్ గెట్ పాస్ వర్డ్ క్లిక్ చేయండి.


అక్కడ మరోసారి మీ CFMS నంబర్ ఎంటర్ చెయ్యగానే మీ‌మొబైల్ కి OTP వస్తుంది.


ఆ OTP ఎంటర్ చేస్తే మీ మొబైల్ కి పాస్ వర్డ్ వస్తుంది.


ఇప్పుడు తిరిగి USER NAME లో మీ CFMS ID, పాస్ వర్డ్ లో మొబైల్ కి వచ్చిన పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.


అక్కడ రెండు విండోస్ కనబడతాయి.


రెండో విండో APGLI కి సంబంధించినది.

ఆ విండో‌క్లిక్ చేస్తే మనకి ఎన్ని‌బాండ్స్ ఉన్నాయి...

ఏ ఏ బాండ్స్ కి ఎంత సొమ్ము చెల్లించాము...ప్రస్తుతం ఎంత subscription పే చేస్తున్నాము. అనే విషయాలు తెలుస్తాయి.


Subscription కి అనుగుణంగా బాండ్స్ ఉన్నాయా లేదా...

మనం‌ఏమైనా APGLI లోన్ తీసుకున్నామా..

సంవత్సరం వారీ subscription ఎంటర్ అయిందా లేదా తెలుస్తుంది


అలాగే పైన మన వ్యక్తిగత వివరాలు కూడా కనపడతాయి.


అయితే ఇక్కడ కనబడుతున్న అన్ని బాండ్స్ మనకి‌ download అవ్వడం లేదు.


త్వరలో DDO లకి ఇచ్చే APGLI బాండ్స్ యాప్ ద్వారా మనకి బాండ్స్ అందుతాయి.


ఇప్పుడు..అన్ని వివరాలు సరిపోతే yes certified అని‌క్లిక్ చేయాలి.


ఏమైనా సమస్యలు ఉంటే No అనే బటన్ క్లిక్ చేసి..మీ‌ సమస్య అక్కడ ఎంటర్ చెయ్యాలి.


మరియు సపోర్టీంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చెయ్యాలి.

ఈ విధంగా APGLI విషయాలు తెలుసుకోవచ్చు.


APGLI Policy Details⬇️



APGLI Missing Credits:


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు APGLI కి సంబంధించి కొన్ని నెలలకు Monthly Premium Amounts Annual Account స్టేట్మెంట్స్ నందు జమ కాకుండా Zero ఉన్నవి.

అలా miss అయిన Missing Credits కొరకు ఈ ప్రొఫార్మా ను fill చేసి మీ యొక్క DDO గారి Counter sign చేయించి Entries Miss అయిన నెలలకి సంబంధించి APGLI Schedules ను జతచేసి APGLI డైరెక్టర్ వారి కార్యాలయం యొక్క dir_ccell_apgli@gov.in

మెయిల్ ID కి మెయిల్ పంపవలెను.


మెయిల్ పంపిన వారికి Missing credits అప్డేట్ చేయబడును.


గమనిక : APGLI Schedules అనగా Nidhi పోర్టల్ నందు salary బిల్ Generate చేసినప్పుడు రిపోర్ట్స్ నందు డౌన్లోడ్ అయ్యే ఉద్యోగుల యొక్క Deductions కి సంబంధించిన pdf.


ఇందులో APGLI Deductions ఉంటే పేజీ ను APGLI Schedule అంటారు.


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page