CPS ఉద్యోగస్తులు Tax deductions గురించి తెలుసుకోవలసిన విషయాలు.
80CCD1: మన శాలరీ లో cut అయ్యే మన 10% అమౌంట్.
80CCD2: మన pran అకౌంట్ కి గవర్నమెంట్ వేసే మ్యాచింగ్ గ్రాంట్.
80CCD-1B: ఇది కూడా మన శాలరి లో కట్ అయ్యే మన 10% అమౌంట్.
ఐతే మన శాలరి లో కట్ అయ్యే 10% అమౌంట్ ఎక్కడ చూపాలి.
మన శాలరి లో కట్ అయ్యే మన cps అమౌంట్10% కాకుండా మనకు(ఉద్యోగికి) 80C కింద 150000 సేవింగ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఉద్యోగి శాలరి నుండి కట్ అయ్యే 10% cps అమౌంట్ 80CCD-1B కిందకు వెళుతుంది.
అలా కాకుండా ఉద్యోగికి 80C కింద 150000 లేనపుడు ఉద్యోగి శాలరి లో కట్ అయ్యే 10% అమౌంట్ 80CCD-1 కిందకు వస్తుంది. ఇక్కడ 80C,80CCD-1 కింద 150000 మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి కి 150000 కంటే అదనంగా సేవింగ్స్ ఉన్నప్పుడు ఉద్యోగి శాలరి నుండి కట్ అయ్యే 10% అమౌంట్ 80CCD-1B కింద చూపబడుతుంది.
ఉద్యోగికి CPS అమౌంట్ కాకుండా 130000 సేవింగ్స్ ఉన్నప్పుడు. శాలరి లో కట్ అయ్యే CPS అమౌంట్ 50000 అనుకుంటే. 50000 లలో 20000 వేలు 80CCD-1 కిందకు, 30000 వేలు 80CCD-1B కిందకు వెళుతుంది.
మన సేవింగ్స్ ను బట్టి ఆటోమేటిక్ గా మన cps అమౌంట్ 80CCD-1 కిందకు గాని, 80CCD-1B కిందకు గాని వెళుతుంది.