top of page
Writer's pictureAPTEACHERS

FA-1 పేరెంట్ టీచర్ మీటింగ్ 10 ఆగస్టు న నిర్వహించాలని ప్రొసీడింగ్స్ విడుదల.


2023-24 విద్యా సంవత్సరం ప్రతీ అసెస్మెంట్ అనంతరం విద్యార్థుల ప్రగతిని చర్చించేందుకు ప్రతి పాఠశాలలో పేరెంట్స్ సమావేశం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్


ప్రతీ పరీక్ష తరువాత పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల


FA-1 పేరెంట్ టీచర్ మీటింగ్ 10 ఆగస్టు న నిర్వహించాలి


Progress Cards should be distributed


ఈ విద్యా సంవత్సరం FA 1 పూర్తి అయినందున దానికి సంబంధించిన తల్లితండ్రుల సమావేశం 10.08.2023 నిర్వహించాలి.


పేరెంట్ టీచర్స్ మీటింగ్(P.T.A)

తల్లిదండ్రులతో సమావేశం...


🖋️ మండల విద్యాశాఖ అధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా ఈనెల 10వ తేదీన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి.


🖋️ ఇటీవల ఆగస్టు ఒకటో తేదీ నుండి 4వ తేదీ వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ -1 మార్కులు తల్లిదండ్రుల సమావేశంలో ప్రదర్శించాలి.


🖋️ విద్యార్థులకు వచ్చిన మార్కుల గురించి తల్లిదండ్రులతో చర్చించాలి.


🖋️ విద్యార్థుల స్థాయిని మరింత పెంచడానికి చేయవలసిన. కృత్యాలను చర్చించాలి.


🖋️ మార్కులతో పాటు మధ్యాహ్న భోజనము. విద్యార్థుల హాజరు పెంపు. ట్యాబ్స్ ఎక్కువగా వినియోగించడం. జగనన్న విద్యా కానుక. అమ్మ ఒడి వినియోగము. వర్క్ బుక్ నోట్స్ పూర్తి చేయడం. పాఠశాలలో పరిశుభ్రత, నాడు నేడు మొదలగు అంశాల గురించి కూడా చర్చించాలి.


🖋️ ఈ సమావేశాలకు DEO లు , APC, DyEO, MEO, సెక్టోరియల్ ఆఫీసర్లు పర్యవేక్షి oచాలి.

రాష్ట్ర విద్యాశాఖ


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page