top of page

🇮🇳INDEPENDENCE DAY CELEBRATIONS GUIDELINES ON 15th AUGUST, 2020.🇮🇳

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Jul 24, 2020

🇮🇳 INDEPENDENCE DAY CELEBRATIONS GUIDELINES ON 15th AUGUST, 2020..🇮🇳

.🇮🇳.🇮🇳.🇮🇳.🇮🇳.🇮🇳.🇮🇳.🇮🇳.🇮🇳


ఆగస్టు 15 వేడుకల నిర్వహణపై మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం.


కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ గురువారం మార్గదర్శకాలను జారీచేసింది.


రాస్ట్ర రాజధానుల్లో ఉదయం 9.00 గంటలకు వేడుకలను నిర్వహించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రులే జెండా వందనం చేస్తారని పేర్కొంది.


అంతేకాదు, పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్ ఫాస్ట్‌కు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని తెలిపింది. కరోనా అత్యవసర సమయంలో సేవలు అందించినవారిని వేడుకలకు అహ్వానించాలని స్పష్టం చేసింది. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని చెప్పింది.


కరోనా వ్యాప్తి దృష్ట్యా భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కాకుండా చూడాలని తెలిపింది. ఇదే విధంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలోనూ వేడుకలు నిర్వహించాలని వివరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరుపుకోవాలని సూచించింది. ఇక, అదే రోజు రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహణపై నిర్ణయాన్ని గవర్నర్లకే వదలిపెట్టింది. ఈ విషయంలో పరిస్థితుల ఆధారంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించింది.



Click here to download proceedings ⬇️


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page