top of page
Writer's pictureAPTEACHERS

Rationalization - Promotions -అనుమానాలు 2022.

Rationalization - Promotions -అనుమానాలు


మిత్రులారా! చాలామంది ఉపాధ్యాయులకు‌, ఈ బదిలీలలో రేషనలైజేషన్ పాయింట్స్ మీద మరియు పదోన్నతుల మీద అనేక అనుమానాలు వున్నాయి.

ఈ క్రింది విషయాలు ఒక్కసారి చదవండి.

👉 కేవలం రోలు తగ్గడం వలన రేషనలైజేషన్ లో పోస్టు పోతుంటే, ఆ పోస్టులో సీనియర్ వెళ్తాను అని విల్లింగ్ ఇచ్చినప్పటికీ అతనికి ఎలాంటి రేషనలైజేషన్ పాయింట్స్ ఇవ్వరు... జూనియర్ మోస్ట్ ఉపాధ్యాయునికి మాత్రమే 5 పాయింట్స్ వస్తాయి...అతను ఆ పాఠశాలకు 2020 బదిలీల్లో వచ్చినప్పటికీ ఎలాంటి పాత పాఠశాల పాయింట్స్ రావు.


👉 మెర్జింగ్/మ్యాపింగ్ వలన‌ రేషనలైజేషన్ కు గురి అయ్యే పోస్టుల్లో వున్న ఉపాధ్యాయులకు అందరికీ రేషనలైజేషన్ పాయింట్స్ అదనంగా 5 పాయింట్స్ వర్తిస్తాయి. ఈ ఉపాధ్యాయులలో కేవలం 2020 బదిలీ ఉపాధ్యాయులకు మాత్రమే పాత పాఠశాల పాయింట్స్ కూడా వస్తాయి.


👉 ఒక‌ పాఠశాలలో పదోన్నతికి అంగీకారం తెలిపివుండి, ప్రస్తుతం రేషనలైజేషన్ లో వారి పోస్ట్ మెర్జింగ్ వలన పోయిన యెడల, ఈ రోజు వరుకు పదోన్నతికి సంబంధించి ఎటువంటి అధికారికమైన ఉత్తర్వులు వారికి ఇవ్వలేదు కనుక వారు తమను తాము SGTs గానే పరిగణించుకొని రేషనలైజేషన్ కు విల్లింగ్ ఇవ్వాలి. ( ఈ రోజు లేదా రేపు పదోన్నతి విల్లింగ్ ఉపాధ్యాయులకు ఆర్డర్స్ జెనరేట్ చేసి చేస్తామంటున్నారు...కానీ ఇప్పటికీ ఇవ్వలేదు కనుక)


👉 పదోన్నతి పొందినవారి పోస్టులను క్లియర్ వేకన్సీగా చూపమని..DEO WEBEX మీటింగ్ లో DEOలకు అధికారులు సూచించారు. అనగా దాదాపుగా పదోన్నతికి విల్లింగ్ ఇచ్చిన SGTs వారిని SAలుగా పరిగణించినట్లే.....కానీ పదోన్నతి విల్లింగ్ ఇచ్చిన వారికి ఎలాంటి అధికారిక ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు....ఇచ్చిన యెడల రేషనలైజేషన్ లో‌ పోయే పోస్టులలో జూనియర్ ఉపాధ్యాయులు బదులు పదోన్నతి ఉపాధ్యాయులు వెళ్తారు. అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వుంటాయి.


👉 పదోన్నతి పొందిన వారు ప్రత్యేకించి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు బదిలీకి అప్లై చేసుకున్న వారందరికీ పాయింట్లు కేటాయించిన సీనియారిటీ జాబితాలో చివరి నెంబర్ కింద నేరుగా పదోన్నతి రోస్టర్ సీనియారిటీ జాబితాను add చేస్తారు కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే బదిలీకి అప్లై చేసుకున్న వారితో పాటే వెబ్ ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఇలా చేసుకోవాలన్నా కనీసం పదోన్నతికి విల్లింగ్ ఇచ్చిన వారికి ఆర్డర్స్ జెనరేట్ చేయాలి.


👉 పదోన్నతికి విల్లింగ్ ఇచ్చిన వారికి ఆర్డర్స్ జెనరేట్ చేసి, ఆ పాఠశాలలో రేషనలైజేషన్ వలన పోయే పోస్టులలో, ఎలాగైతే 8 అకడమిక్ సంవత్సరాల వారు బదిలీల్లో వెళ్ళడం వలన రేషనలైజేషన్ పోస్ట్ పోతుందో, అలాగే‌పదోన్నతి పోస్ట్ పోయేలా చేయవలసి ఉంటుంది.


👉 ఇప్పుడు బదిలీల్లో రేషనలైజేషన్ పాయింట్స్ ఎవరు తీసుకోవాలి ?????? ఈ ప్రశ్నకు సమాధానం, కేవలం, పదోన్నతి విల్లింగ్ ఇచ్చిన వారికి వెంటనే ఆర్డర్స్ జెనరేట్ చేయడం

అన్నిటికీ తొందరలోనే‌ సమాధానం దొరుకుతుంది అని ఆశిద్దాం


21 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page