SA 2 (CBA3) TOEFL Exam మరియు SLAS Exam 2024 నిర్వహణ మార్గదర్శకాలు.
👉ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 06.04.2024 నుండి 19.04.2024 వరకు CBA-3/SA-2 పరీక్షలు జరుగుతాయి వారిచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించవలెను
👉1 తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ప్రశ్న పత్రాలు కాంప్లెక్స్ నందు ఇవ్వబడతాయి
👉6 నుండి 10వ తరగతి వరకు *ప్రభుత్వ మరియు ప్రైవేట్* పాఠశాలలకు ప్రశ్న పత్రాలు MRC లో ఇవ్వబడతాయి
👉ప్రశ్నాపత్రములు ఏ రోజు జరిగే పరీక్ష ఆ రోజు మాత్రమే ఇవ్వబడతాయి.
👉 ఒకటో తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు OMR లను MRC లో లేదా కాంప్లెక్స్ నందు ఇవ్వబడతాయి
👉 తొమ్మిదవ తరగతి కి SA -2 పద్ధతిలో పరీక్షలు నిర్వహించవలెను
👉 ప్రింటెడ్ OMRs 1 నుండి 8వ *తరగతి* వరకు ప్రతీ విద్యార్థికి ఇవ్వవలెను
👉 ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కలిపి ఒక OMR లో ఉంటాయి
👉 6,7,8 తరగతి విద్యార్థులకు లాంగ్వేజ్ సంబంధించి ఒక OMR ఇవ్వవలెను అదేవిధంగా నాన్ లాంగ్వేజ్ కి సంబంధించి మరొక OMR ఇవ్వవలెను
👉ఒకవేళ ఏ విద్యార్థి వివరాలు అయినా online లో చేయడం ఆలస్యం అయిన కారణంగా OMR ప్రింట్ చేయకపోతే *Buffer* *OMRను* ఉపయోగించవలెను.
👉OMR లు ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఇవ్వబడతాయి
👉1,2,3 తరగతులకు OMR ల పై ఉపాధ్యాయులు విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి
👉4వ మరియు 8వ తరగతి తరగతుల OMR లపై విద్యార్థులే బబుల్ చేయాలి
👉1 నుండి 200 ల వరకు ఉపయోగించిన OMR లు ఒక కవర్ ఉంచవలెను.
👉 ఏ పాఠశాలలో అయినా OMR ల సంఖ్య 200 దాటిన యెడల ప్రతీ 200 OMRలకు ఒక కవర్ ఉపయోగించవలెను.
👉 ఉపయోగించని (Unused) OMR లను పాఠశాలలో భద్రపరచవలెను
👉TOEFL సంబంధించి 3,4,5 తరగతులకు ఏప్రిల్ 10వ తేదీన English PART-B నిర్వహించవలెను
👉 6,7,8,9 తరగతులకు ఏప్రిల్ 12వ తేదీన English PART-B నిర్వహించవలెను
👉3,4,5 తరగతులకు ఒక ప్రశ్న పత్రము ఇవ్వాలి అదేవిధంగా
6,7,8,9 తరగతులకు మరొక ప్రశ్న పత్రం ఇవ్వాలి
👉 ప్రీ ప్రింటెడ్ OMR పై విద్యార్థులు తమ సమాధానాలను బబుల్ చేయవలెను
👉OMR లో కుడిచేతి వైపు ఉన్న ఫామ్ కోడ్ / స్కూల్ యూస్ ఓన్లీ అని ఉన్న బాక్స్ లో ఫీల్ చేయవలసిన అవసరం లేదు
👉 టీచర్ అటెండెన్స్ యాప్ లో OMR స్కాన్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడుతుంది దాని ద్వారా ఆన్లైన్ అటెండెన్స్ కోసము OMR స్కాన్ చేయవలెను.
👉 లిజనింగ్ ఆడియో క్లిప్స్ IFP/SMART TV/ టీచర్ ట్యాబ్ లలో రాష్ట్రస్థాయి నుంచి IT సెల్ వారిచే పరీక్ష రోజు పంపబడతాయి
👉TOEFL ప్రశ్న పత్రాలు విద్యార్థులకు తిరిగి ఇవ్వరాదు తిరిగి USED/UNUSED అన్ని ప్రశ్న పత్రాలు ఒక కవరు
నందు మరియు OMR లను ఒక కవర్ నందు ప్యాక్ చేసి MRC కి సమర్పించవలెను
👉పరీక్ష చివరి రోజున అనగా 19.04.2024 తేదీన అన్ని రకాల OMR లు మరియు TOEFL ప్రశ్నాపత్రాలు USED/ UNUSED MRC కి సమర్పించవలెను