top of page

TaRL మండల స్థాయి శిక్షణ వివరాలు

అన్ని మండల కేంద్రాలలో 17-10-22 నుండి 20-10-22 వరకు 4 రోజులపాటు మండలం లో 3,4 మరియు 5 తరగతులు బోధిస్తున్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల ఉపాధ్యాయులకు మొదటి TaRL మండల స్థాయి శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి నదిగా కోరడమైనది.


TaRL training each spell 4 days:


1st spell 17 to 20


2nd spell 21 to 26


3rd spell. 27 to. 31


TaRL Training  ముఖ్య అంశాలు:


ఈ training అక్టోబర్ 17 నుండి 31వరకు ప్రతి స్పెల్ కు 4 రోజులు చొప్పున 3 స్పెల్స్ లో జరుగుతుంది.


తెలుగు, లెక్కల మీద శిక్షణ జరుగుతుంది.


training పూర్తయిన తరువాత baseline test పెట్టాలి.


3, 4, 5 తరగతుల పిల్లలను   వారి స్థాయిని బట్టి రెండు గ్రూపులు చేయాలి.


ఆ తరువాత ఆ రెండు గ్రూపుల పిల్లలకి ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటు తెలుగు, గణితం సబ్జెక్టులో నిర్దేశించిన అంశాలు చెప్పాలి


నవంబర్ నుండి మార్చి ఆఖరు దాకా TaRL programme ఈ  విద్యా సంవత్సరానికి అమలు చేయాలి.


app lo baseline, middle line, end line report. లు సబ్మిట్‌చేయాలి. (app లింక్ శిక్షణ సమయంలో ఇవ్వబడుతుంది)


ఈ శిక్షణకు సంబంధించి అన్ని రకాల మెటీరియల్ ఇస్తారు.


ట్రైనింగ్ సందర్భంగా ఏ ఒక్క బడి మూత బడకుండా చూసుకోవాలి. 50% ఉపాధ్యాయులకు మొదటి విడతలో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.


సింగిల్ టీచర్లు ఉన్న పాఠ శాల ల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పాఠ శాల మూత పడకుండా చూడాలి.


మండల ఉపాధ్యాయుల సంఖ్య 200 పైన ఉంటే మాత్రమే 3 విడతల్లో ట్రైనింగ్ ఇవ్వాలి. లేని మండలాలలో రెండు విడతల్లో మాత్రమే ట్రైనింగ్ నిర్వహించాలి.


ఇదివరకే డివిజనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి లో శిక్షణ పొందిన MLRP లు మరియు DRP లు ఈ శిక్షణ ను ఇవ్వవలసి ఉంటుంది.


మీ మండలం నుండి ఇదివరకే ఇద్దరు CRP లు డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ పొందిఉంటే, వారు ఇద్దరు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వవలసి ఉంటుంది.

అట్లు కాక, ఒక CRP నే డివిజనల్ లెవెల్ ట్రైనింగ్ కు హాజరయ్యి ఉంటే ,ఆయనతో పాటు ఇదివరకు ట్రైనింగ్ పొందని మరొక CRP కూడా ట్రైనింగ్ కు హాజరు కావాలి.

మొత్తం మీద ప్రతి మండలం నుండి ఇద్దరు CRP లు మాత్రమే (అన్ని విడతలకు కలిపి) హాజరు కావాల్సి ఉంటుంది.


ఈ ట్రైనింగ్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు TA, working lunch,రెండు పూటలా టీ మరియు స్నాక్స్ ఇవ్వబడును.


కావున అందరు MEO లు కోర్సు డైరెక్టర్లు గా కార్యక్రమ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవలసి నదిగా కోరడమైనది.


How to apply Training Duty in School attendance app:


1. Login


2. Click on Leave management


3. Click on Special Duty


4. Click on Special Duty type


5. Select 'Training"


6. Select 'From Duty"


7. Select Date


8. Select "To duty"


9. Write venue name


10. Submit




యూనిట్ కాస్ట్ ఫర్ టీ, స్నాక్స్ మరియు లంచ్ :₹ 190/-


ట్రైనీ లకు ఒక పెన్+ ఒక పుస్తకం: ₹ 60/-


మిగిలిన బడ్జెట్ మరియు ఇతర వివరాలకు క్రింది ప్రొసీడింగ్స్ చూడగలరు.



Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page