
అనధికారిక గైరు హాజరు ఐన వారి మీద చర్యలు తీసుకొనుట గురించి తాజా ఉత్తర్వులు.
- APTEACHERS
- Sep 17, 2020
- 1 min read
Updated: Aug 23, 2021
Unauthorized absence – prolonged absence from duty without proper leave - Take appropriate action.
సరైన సెలవు లేకుండా విధి నుండి ఉద్దేశపూర్వకంగా మరియు దీర్ఘకాలం లేకపోవడం అధికారులు తగిన చర్యలు తీసుకోవడానికి ఉత్తర్వులు.
Memo Rc.No.ESE02-30024/1/2020-A&I-CSE, Dated:16/09/2020
అనధికారిక గైరు హాజరు ఐన వారి మీద చర్యలు తీసుకొనుట గురించి తాజా ఉత్తర్వులు.
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
డీఈవోలను ఆదేశించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్: చినవీరభద్రుడు.
✳ బోధన, బోధనేతర సిబ్బందికీ వర్తింపు.
✴ ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరయ్యే బోధన, బోధనేతర సిబ్బందిని గుర్తించి, వారిని వెంటనే సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు.
✴ ఈ మేరకు డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు.
✴ ఎవరెవరిని సర్వీసు నుంచి తొలగిస్తారంటే
✴ అనుమతులు లేకుండా ఏడాదికి మించి విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, సెలవు పెట్టి అయినా, పెట్టకుండా అయినా ఐదేళ్లుగా విధులకు హాజరుకాకుండా ఉన్నవారు ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితి దాటిపోయినా ఇతర విభాగాల్లో కొనసాగుతూ స్కూల్ విధులకు గైర్హాజరవుతున్న వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు చేపడతారు.
✴ అనుమతి లేకుండా గైర్హాజరైన కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని హెచ్ఎంలు, ఎంఈవోలు, టీచర్, నాన్టీ చింగ్ స్టాఫ్ నుంచి వినతులు వస్తున్నాయి.
✴ అయితే గైర్హాజరవ్వడం సర్వీస్ రూల్సు ప్రకారం మిస్కాండక్టుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవలసిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
✴ 30 రోజులకు పైగా అనధికారికంగా ఆబ్సెంట్ ఉన్న హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలి.
✴ ఎవరైనా ఏడాదికి మించి రిపోర్టు చేయకుండా ఉన్న వారుంటే వారి పేర్లను పత్రికల్లో ముద్రించేలా చర్యలు చేపట్టాలి అనంతరం వారి పేర్లను గెజిట్లో ముద్రించి చర్యలు చేపట్టాలి.
Click here to download memo copy ⬇️