top of page
Writer's pictureAPTEACHERS

ఆరోగ్యకరమైన జీవనానికి కొన్ని నిర్దుష్ట చర్యలు.

💚ఆరోగ్యకరమైన జీవనానికి కొన్ని నిర్దుష్ట చర్యలు:


1. ఉదయం నిద్ర లేస్తూ భగవంతునికి , తల్లి తండ్రులకు నమస్కరించండి

2. నిద్రలేచిన వెంటనే పళ్ళు తోముకోకుండానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగండి

3.బరువు తగ్గాలి అనుకుంటే అందులో కొంచెం నిమ్మరసం , తేనె వేసుకుని త్రాగండి

4.మలవిసర్జన సమయంలో పళ్ళను గట్టిగా నొక్కిపెట్టడం వలన వృద్ధాప్యంలో కూడా పళ్ళు గట్టిగా ఉంటాయి

5.దంతధావన సమయంలో చల్లని నీటిని నోటినిండా తీసుకుని పుక్కిలిస్తూ చల్లని నీటిని రెండు చేతులతో కళ్లపై చల్లుకుంటే కళ్ళ ఆరోగ్యం బాగుంటుంది

6.స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే వంటిదుర్గంధం తగ్గుతుంది . తాజాదనం ఫీల్ అవుతారు

7.ఆరోగ్యమైన జీవితం కోసం సాత్విక , ప్రాకృతిక , సహజ ఆహారం తినండి .

8.శరీర సమతౌల్యం, శక్తి, చర్మ సౌదర్యం కోసం రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగండి.

9.నీరు ఎప్పుడు త్రాగినా కూర్చుని త్రాగండి . అందువలన మీకు మోకాళ్ళనొప్పి రాదు.

10.వ్యాధులకు అత్యుత్తమ చికిత్స - ఉపవాసం

11.దీర్ఘకాల ఉపవాసం అనారోగ్యకరం.

12. ☘️ఉపవాసం వలన శరీరం లోని మలినాలు ( టాక్సిన్స్ ) బయటకు గెంటివేయబడతాయి

13.☘️ సామర్ధ్యం అనుసరించి, అవుసరం అయినంత ఆహారం తీసుకోండి.

14.అధికమయిన ఆహారం అజీర్ణం కలగచేస్తుంది . అనారోగ్యాన్ని కలుగచేస్తుంది

15.సకాలంలో ఆహారం తీసుకోండి. అందువలన జీవన గడియారం సక్రమంగా ఉంటుంది .

16.భోజనానికి సరిగ్గా ముందు , భోజనం చేసినవెంటనే నీరు త్రాగకండి. నీటికి భోజనానికి మధ్య కనీసం ఒక అరగంట వ్యవధి ఇవ్వండి .

17.భోజనాన్ని క్రింద కూర్చుని తినడం ఉత్తమ అలవాటు . డైనింగ్ టేబుల్ వాడుతూ ఉంటె కుర్చీలో మఠం వేసుకుని కూర్చుని తినండి .

18.భోజనం చేస్తూ మాట్లాడకండి . అన్నం భగవత్ప్రసాదంగా భావించి ఆయనకు సమర్పించి తినండి

19. టి . వి . చూస్తూ భోజనం చెయ్యకండి

20. 🌿భోజనం చివరిలో ఐసుక్రీం వంటి చల్లని పదార్ధాలు తినకండి

21. 🍁ఇత్తడి బిందెలో నీరు మంచిది . రాగి బిందె నీరు వరుసగా మూడునెలలు త్రాగితే ఒక నెల విరామం ఇవ్వండి

22. 🍁వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోండి. అది మీకు నడుమునొప్పి రాకుండా చేస్తుంది

23. 🌹ఉదయం అల్పాహారం లో మొలకలు ( పీచుపదార్ధాలు) ఉండేలా చూసుకోండి . పండ్లను తినండి. సలాడ్లు తినండి

24. 🌹భోజనంలో ఆకుకూరలు , కాయగూరలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. నూనెలు తగ్గించి బదులుగా ఆవునెయ్యి వాడండి . అది బరువును పెంచదు.

25. 🌹ఉప్పు, నూనె, కారం ఆహారానికి రుచిని మీకు అనారోగ్యాన్నీ చేకూరుస్తాయి అని మరువవద్దు .

26.🌼 మితంగా తినండి . బ్రతకడం కోసం తినండి . తినడం కోసం బ్రతకకండి .

28. 🌼రాత్రి నిద్రకు కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తి చెయ్యండి . రాత్రి ఎనిమిది గంటలలోపులో భోజనం ముగించండి . మీ కాలేయం రాత్రి 11 . 00 నుండి ఉదయం

4 . 00 వరకూ విశ్రాతి తీసుకునే అవకాశం ఇవ్వండి .

29. 🌼నిద్రకు మెత్తటి పరుపులు , ఎత్తు ఎక్కువ ఉన్న తలగడలు హాని కలిగిస్తాయి.

30. 🌿ఎడమవైపుకు తిరిగి పడుకొండి . అందువలన మీ జీర్ణక్రియకు దోహదపడే “కుడి స్వరం” లో శ్వాస ఆడుతుంది . కుడి ముక్కు నుండి శ్వాసలు జరగడం వలన ఉష్ణశక్తి ( సూర్యనాడి ) జనిస్తుంది

31.🌿 వ్యాదిరహిత జీవనానికి మానసిక శాంతి అవుసరం . ఆనందం గా ఉంటూ ఉండండి.

32.🌿 విచారాన్ని వెంటబెట్టుకుని తిరగకండి

33.🌿 నిన్నటి విచారం , రేపటి ఆందోళన మీ నేటి జీవిత ప్రశాంతతకు భంగం కలిగించనివ్వకండి

34. 🔆చింత , ఆందోళన మీకు గుండె సంబంధ వ్యాధులను కలిగిస్తాయి

35.🔆 ఆందోళన , భయము మీలో వాత సంబంధ వ్యాధులను కలిగిస్తాయి

36. 🔆 ఈర్ష్య, కోపం మీలో పిత్తాన్ని ప్రకోపింపచేసి జీర్ణ సంబంధ వ్యాధులను కలిగిస్తాయి

37. 🌹దురాశ , అధిక ఆందోళన , ఒత్తిడి మీలో కఫాన్ని ప్రకోపింపచేసి శ్వాస సంబంధ వ్యాధులను కలుగచేస్తాయి

38.🌹 Stress is the main cause of all diseases

39. నిద్రపోయే ముందు “నీ ఒడిలో నన్ను పడుకో బెట్టుకో ! నాకు చక్కని స్వల్పకాలిక లయను ప్రసాదించు” అని దైవాన్ని ప్రార్ధించండి .

40. 🌼ఆరోజు మీ జీవితం లో ఏమి సాధించారో ఒక్కసారి పరిశీలించుకోండి . మరుసటిరోజు మంచిపనులు చేసేలా చూడమని ఆయన్ను ప్రార్ధించండి.

41. 🌼పెద్దలను గౌరవించడం ఒక అలవాటు చేసుకోండి.

42.🌼 పిల్లలను ప్రేమగా పిలవడం నేర్చుకోండి.

43.🌿 ఆంటీ , అంకుల్ వంటి ఇంగ్లీష్ పిలుపులకు బదులు ఆప్యాయతను తెలియచేసే వరుసలతో పిలవండి.

44.🌿 మీరు సౌమ్యంగా ఉంటె లోకం అంతా సౌమ్యంగా ఉంటుంది

చక్కని జీవితానికి ఈ మార్గాలు ఉపకరిస్తాయి.

ధన్యవాదములు


సర్వే జనా సుఖినోభవంతు 🙏

2 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page